మావో సుప్రీం కమాండర్.. అలిపిరి దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో హతం

Publish Date:May 21, 2025

Advertisement

ఛత్తీస్ గఢ్ లో బుధవారం (మే 21) ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి సూత్రధారి నంబాల కేశవరావు  అలియాస్ గగన్నా కూడా ఉన్నారు. 2012లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన మెరుపుదాడిలోనూ నంబాల కేశవరావుదే ప్రధాన పాత్ర.  మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు  గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో దిట్ట అని చెబుతారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చేశాడు నంబాల కేశవరావు ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజం పట్ల  ఆకర్షితుయ్యాడు. ఆయన తండ్రి ఉపాధ్యా యుడు.

శ్రీకాకుళం జిల్లా జియన్న పేట నంబాల కేశవరావు స్వస్థలం. ఈయన 1955లో జన్మించిన ఆయన వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మునుపటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్) నుంచి బీటెక్ పూర్తి చేశారు. 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. 1980లో ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.  2004లో పీపుల్స్ వార్  మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లో కేంద్ర సైనిక కమిషన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నిపుణుడు. 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలాం మాజీ యోధుల దగ్గర శిక్షణ పొందారు. నంబాల కేశవరావు  మావోయిస్టులు జరిపిన పలు దాడులలో కీలక పాత్ర పోషించారు.  2010లో దంతేవాడలో 76 సీఆర్‌పీఎప్ జవాన్లు హతమైన దాడిలో నంబాల కేశవరావుదే కీలక పాత్ర.  

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా ఉన్న నంబాల కేశవరావు బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. నంబాల కేశవరావుపై రూ. కోటీ  30 లక్షల రివార్డు ఉంది. నంబాల కేశవరావు మృతి మావోయిస్టులకు తేరుకోలేని ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.  

By
en-us Political News

  
హానీమూన్ మర్డర్ కేస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతి పెద్ద సంచలనం. ఈ కేసు వ్యవహారంలో అనేక మలుపులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్. పైకి తన ముందు అక్కా అక్కా అంటూనే లోలోపల తన సోదరిని అతడు బుట్టలో పడేశాడని వాపోతున్నాడు సోనమ్ సోదరుడు గోవింద్.
సరిగ్గా ఏడాది క్రితం అంటే గత ఏడాది జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికి రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. అరాచక పాలనతో, విధ్యాంసాలతో జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీ తల్లికి వందనం పథకాన్ని తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం (జూన్ 12) నుంచి అమలు చేయనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి గురువారం నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆరంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
జగన్ సొంత మీడియా చానెల్ లో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది.
మంత్రి పదవి దక్కక పోవడంతో తీవ్ర నిరాశ లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఇటీవల జరిగింది. అది కూడా పాక్షికంగానే. తెలంగాణ క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జారి పడి గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించారు.
జగన్ పొదిలి పర్యటన రసాబాసగా మారింది. పోగాకు వేలం కేంద్రం సందర్శన అంటూ పొదిలిలో పర్యటించిన జగన్ కు నిరసనల సెగ గట్టిగా తగిలింది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్‌కు పార్టీపరంగా ప్రమోషన్ ఎప్పుడు?..అనే ప్రశ్న ఇప్పుడు అటు పార్టీలోను...ఇటు రాజకీయ వర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారిపోయింది. లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ప్రకటించాలని మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు.
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ రంగరెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో మంగళవారం (జూన్ 10) రాత్రి జరిగాయి.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి బయలుదేరి ఆయన నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు.
ముందు వెనుకలాలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి.. ఇప్పుడు అరెస్టు భయంతో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు జర్నలిస్టు కృష్ణంరాజు.
మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.