జడల నాగరాజు ఏమయ్యాడు ?
Publish Date:Mar 14, 2012
Advertisement
మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ చాలాకాలంగా తెలియడంలేదు. రెండున్న నెలల క్రితం అతను అదృశ్యమయ్యాడు. గతంలో పోలీసులకు కోవర్ట్ గా పనిచేసిన నక్సలైట్ నాగరాజు మావోయిస్టులపై కోలుకోలేని దెబ్బకు కారణమయ్యాడు. అతను అందించిన సమాచారంతో పోలీసులు కొందరు ప్రముఖ మావోయిస్టులను మట్టుబెట్టగలిగారు. కోవర్ట్ గా మారిన నాగరాజు పోలీసుల అండదండలతో సెటిల్ మెంట్లు అనేకం చేశాడు. పెద్ద ఎత్తున డబ్బు కూడా ఆర్జించాడని చెబుతున్నారు. అటువంటి వ్యక్తి డిసెంబర్ 7న బయటకు వెళుతూ తాను 15 రోజుల వరకు ఇంటికి రానని, తనకు ఫోన్ చేయవద్దని, తానే ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వ్యక్తి ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో నాగరాజు సోదరుడు జడల సురేందర్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగరాజును మావోయిస్టులు ఎప్పటినుంచో టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికితోడు పోలీసులు కూడా జడల నాగరాజుతో అవసరం తీరిపోయిందని, అతన్ని వదిలించుకుని ఉండవచ్చునన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/maoist--jadala-nagaraju-24-12616.html
Chandrababu Naidu recieved a letter from Anna Hazare
గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అరెస్టు నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు
అసెంబ్లీలో నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఒకరికొకరు ఎన్నెన్ని మాటలనుకున్నా ఫరవాలేదు. కోపంతో తిట్టుకున్నా బాధలేదు... కానీ వారి ఆవేశం అసెంబ్లీలోని బల్లలు, మైకులపై చూపిస్తేనే ఇబ్బంది. అసెంబ్లీలో తెలంగాణాపై అన్ని పార్టీలు తమ వైఖరులు చెబుతున్న నేపథ్యంలో స్పీకర్ లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్‌కు మైక్ ఇవ్వడం.. ఆయన బంద్‌లవల్ల సరైన ట్రాన్స్‌పోర్ట్ లేక ప్రతిరోజూ 60మంది ఉద్యోగులను ఐబిఎం కంపెనీ విమానంలో బెంగుళూరు తీసుకెళుతోందని చెప్పారు.
ట్యాంక్ బండ్ పై కూలిన విగ్రహాలను మళ్ళీ ఏర్పాటు చేస్తాననటం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమేనని, విగ్రహాలను ఏర్పాటు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణా మార్చ్ కు పిలుపునిచ్చిన సమయంలో ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదని, తెలంగాణా వైతాళికుల విగ్రహాలు పెట్టకుండా ప్రభుత్వం వేరే విగ్రహాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజలను అవమానించడమేనని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వామపక్షాలు భారత్‌బంద్ పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న పలువురు కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేలు విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్టాయి. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి.
Nine persons were on Sunday killed and five others injured as several houses caved in following a series of cloudbursts in different areas of Uttarakhand’s Rudraprayag district, taking the death toll since Friday to 47. Cloudbursts struck four villages including Kirorimalla, Timli Badma, Dugur Shemla and Simbal on Sunday morning, in which nine persons died and five others were injured. With these deaths, the toll in Rudraprayag district in the last two days went up to 47, whereas, five persons were injured and 23 others still missing.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమంగా అనేక ప్రయోజనాలు పొంది దానికి బదులుగా జగన్ సంస్థల్లో పెట్టు బడులు పెట్టిన ముగ్గురు రెడ్డి పారిశ్రామికవేత్తలను సిబీఐ త్వరలో అరెస్టు చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగు తోంది.
తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్నా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముందస్తుదాడి వ్యూహాన్ని అమలు చేస్తోంది. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతునిస్తున్న ప్రజాసంఘాలు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను తరిమికొట్టాలని పిలుపునిచ్చాయి.
డప జిల్లాలో సుమారు రూ.100 కోట్లు విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూముల ఆక్రమణపై 1995 తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సభాసంఘం జిల్లా అంతా పర్యటించి ఏఏ ప్రాంతలో వాక్ఫ్ భూములను ఎవరూ ఎంత ఆక్రమించుకున్నారో పరిశీలించింది.
నిరుపేద గ్రామీణ ప్రజలకు అత్యవసర సేవలతో పాటు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన 104 వైద్యసేవా విభాగాన్ని క్రమంగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం వరకు వీరికి సక్రమంగా జీతాలు అందలేదు.
రాష్ట్ర ప్రభుత్వం మేనెలలో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా సహకార సంఘాల ఎన్నికలు వాయిదాపడుతూ వచ్చాయి.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలు పల్లెబాటపట్టారు. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేయడం ఖాయం.
రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రజలు మరో దోపీడీకి గురవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న వేలాది కూల్ డ్రింక్ షాపులు, చిల్లర దుకాణాలు, కిళ్ళీ షాపులు చిల్లర దోపిడీకి పాల్పడుతున్నాయి.





