Publish Date:Dec 27, 2024
ప్రధానిగా, ఆర్ధిక మంత్రి గా దేశాన్ని కొత్తపుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్(92) గురువారం కన్నుమూశారు. 1991నుంచి ఆయన నిరాటంకంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.1991లో పీవీ మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి గా ఆర్ధికసంస్కరణలు దేశానికి రుచి చూపించి కుప్పకూలే పరిస్థితి లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ను నిలబెట్టారు.ఆయన కు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అసలు ఆర్ధిక సంస్కరణల కోసమే ఆర్ధిక వేత్త మన్మోహన్ ను రాజకీయాలలోకి పీవీ తీసుకువచ్చారు.
ఆయన తన ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానంతో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు .బంగారం తాకట్టు పెట్టే స్థాయి నుంచి ఆర్ధిక వ్యవస్థ ను సుస్థిరం చేసారు.అలా రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మన్మోహన్ సింగ్ ను ప్రధాని పదవి వరించింది.రాజ్యసభ సభ్యుడిగానే 10 ఏళ్లు ప్రధానిగా ఆ పదవిలో ఉన్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు పొందారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్ లోని పంజాబ్ లో జన్మించిన మన్మోహన్, 1958లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్రం చదివి, 1962లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో డాక్టరేటు పొందారు. 1978-80మధ్య రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా,1982-85లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ గవర్నర్ గా కూడా పని చేశారు.
కాంగ్రెస్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత ఎక్కువ కాలం ప్రధానిగా చేసినది మన్మోహన్ సింగ్ మాత్రమే. ఆయన ఐదు పర్యాయాలు అసోం నుంచి, ఆ తర్వాత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఒక్కసారి కూడా లోక్ సభ కు ఎన్నిక కాకపోవడం గమనార్హం. ఆయన ఈ 33ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక గౌరవ పదవులు నిర్వహించారు.ఈ నాటికీ భారత ఆర్థిక వ్యవస్థ చెదరకపోవడానికి ఆనాటి ఆయన ఉక్కు సంకల్పమే కారణమనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి రాజకీయ ఆర్థిక వేత్త భారత్ కు లభించడం,ఆయనను వెలికి తీసిన పీవీ లాంటి మేధావి ఉండడం భారతీయుల అదృష్టం గా భావించాలి. ఆయన నాటిన విత్తే నేటికీ భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
ఆయన ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం నుంచి పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఆర్ధిక మంత్రి పదవి,ప్రధానమంత్రి పదవి అనుకోకుండా లభించినా ఆ పదవులకు గౌరవం తెచ్చారు. ప్రధాని పదవికి తన విదేశీయత కారణంగా సోనియా గాంధీ అనర్హురాలంటూ ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలతో ఆమె ఆ పదవికి మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసారు. యూపీఏ చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీని కలసి ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిర్ణయాలను నిర్ణయాలు తీసుకునేవారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నసమయంలోనే ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టి ప్రజల మన్నలను పొందారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/manmohan-architect-of-economic-reforms-39-190386.html
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.