దేశంలో ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్

Publish Date:Dec 27, 2024

Advertisement

ప్రధానిగా, ఆర్ధిక మంత్రి గా దేశాన్ని కొత్తపుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్(92) గురువారం కన్నుమూశారు. 1991నుంచి ఆయన నిరాటంకంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.1991లో పీవీ మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి గా ఆర్ధికసంస్కరణలు దేశానికి రుచి చూపించి కుప్పకూలే పరిస్థితి లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ను నిలబెట్టారు.ఆయన కు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అసలు ఆర్ధిక సంస్కరణల కోసమే ఆర్ధిక వేత్త మన్మోహన్ ను రాజకీయాలలోకి పీవీ తీసుకువచ్చారు.

ఆయన తన ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానంతో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు .బంగారం తాకట్టు పెట్టే స్థాయి నుంచి ఆర్ధిక వ్యవస్థ ను సుస్థిరం చేసారు.అలా రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మన్మోహన్ సింగ్ ను ప్రధాని పదవి వరించింది.రాజ్యసభ సభ్యుడిగానే 10 ఏళ్లు ప్రధానిగా ఆ పదవిలో ఉన్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు పొందారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్ లోని పంజాబ్ లో జన్మించిన మన్మోహన్, 1958లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్రం చదివి, 1962లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో డాక్టరేటు పొందారు. 1978-80మధ్య రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా,1982-85లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ గవర్నర్ గా కూడా పని చేశారు.

కాంగ్రెస్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత ఎక్కువ కాలం ప్రధానిగా చేసినది మన్మోహన్ సింగ్ మాత్రమే. ఆయన ఐదు పర్యాయాలు అసోం నుంచి, ఆ తర్వాత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఒక్కసారి కూడా లోక్ సభ కు ఎన్నిక కాకపోవడం గమనార్హం. ఆయన ఈ 33ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక గౌరవ పదవులు నిర్వహించారు.ఈ నాటికీ భారత ఆర్థిక వ్యవస్థ చెదరకపోవడానికి ఆనాటి ఆయన ఉక్కు సంకల్పమే కారణమనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి రాజకీయ ఆర్థిక వేత్త భారత్ కు లభించడం,ఆయనను వెలికి తీసిన పీవీ లాంటి మేధావి ఉండడం భారతీయుల అదృష్టం గా భావించాలి. ఆయన నాటిన విత్తే  నేటికీ భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా  కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.

ఆయన ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం నుంచి పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఆర్ధిక మంత్రి పదవి,ప్రధానమంత్రి పదవి అనుకోకుండా లభించినా ఆ పదవులకు గౌరవం తెచ్చారు. ప్రధాని పదవికి తన విదేశీయత కారణంగా సోనియా గాంధీ అనర్హురాలంటూ ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలతో ఆమె ఆ పదవికి మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసారు. యూపీఏ చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీని కలసి ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిర్ణయాలను నిర్ణయాలు తీసుకునేవారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నసమయంలోనే  ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టి ప్రజల మన్నలను పొందారు.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.