కవిత రాజీనామా ఆమోదం ఎప్పుడంటే?

Publish Date:Sep 30, 2025

Advertisement

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నిజమే.. అయితే ఆమె రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు. అంటే టెక్నికల్ గా కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఎమ్మెల్సీయే. కవిత తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్ లోనే ఇచ్చారు. ఆ విషయాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా చెప్పారు. అంతే కాదు.. కవిత.. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరుతూ తనకు ఫోన్ కూడా చేశారని గుత్తా తెలిపారు.  అయితే రాజీనామా ఆమోదం విషయంలో మాత్రం ఆయనేం చెప్పలేదు. 

ఎందుకంటే.. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. గుత్తా పేరుకు బీఆర్ఎస్ యే అయినా.. కుమారుడిని కాంగ్రెస్ లో చేర్చిన తరువాత నుంచీ ఆయన ఆ పార్టీకి ఒకింత సన్నిహితంగానే మెలుగుతున్నారని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.  ఎంత కాదనుకున్నా.. మండలి చైర్మన్ గా ఆయన తటస్థం అనే చెప్పాలి. అందుకే కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదానికి ఆయనకు ఎటువంటి రిజర్వేషన్లూ ఉండే అవకాశం లేదు. మరి కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదం విషయంలో ఆయన ఎందుకు తాత్సారం చేస్తున్నారూ అంటే.. కవిత రాజీనామా ఆమోదిస్తే.. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే? కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 వరకూ ఉంది. దీంతో ఇప్పుడు ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక అనివార్యం. అదే జరిగితే కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు.

ఎందుకంటే వాటి కాలపరిమితి పూర్తై ఏడాది దాటిపోయింది. స్థానిక సంస్థలలో సభ్యులెవరూ లేరు.  స్థానిక ఎన్నికల తరువాత ఆ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్ని ఉంటుంది. అందుకే  కవిత రాజీనామా ఆమోదం విషయంలో మండలి చైర్మన్ తాత్సారం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బహుశా కవిత రాజీనామా ఆమోందం పొందుతుందేమో అంటున్నారు పరిశీలకులురాజీనామా ఆమోదంపై వేచి చూడాలని మండలి చైర్మన్ కు సంకేతాలు వచ్చినట్లుగా భావిస్తున్నారు. 

By
en-us Political News

  
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.