మార్చిలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు?

Publish Date:Feb 12, 2026

Advertisement

తెలంగాణలో ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. పంచాయతీ ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యత సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ  ఆ ఉత్సాహంతో మునిసిపోల్స్ కు వెళ్లింది. బుధవారం (ఫిబ్రవరి 11)  రాష్ట్రంలో 16 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్స్ పోల్సన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంకెంత మాత్రం జాగు లేకుండా పరిషత్ ఎన్నికలకు రెడీ అయిపోతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు మార్చిలో నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

విజయోత్సాహం ఒక వైపు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు నిర్వహిం చకుంటే   జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 450 కోట్ల రూపాయల నిధులు మురిగిపోతాయన్న భయం మరోవైపు ఉండటంతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు వచ్చే నెల తొలి వారంలో జరిగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు రెండు విడతలలో జరుగుతాయని తెలుస్తోంది.  

By
en-us Political News

  
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.