Publish Date:Aug 24, 2024
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాదిగ నాయకుడు మంద కృష్ణమాదిగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మంద కృష్ణ మాదిగ చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆమోదించిన వెంటనే మండ కృష్ణ ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చొరవ వల్లే వర్గీకరణ సాధ్యమైందని, గతంలో కూడా చంద్రబాబు వల్లే ఎంతోమంది దళితులకు ఉద్యోగాలు వచ్చాయని మందకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపినప్పుడు, మాదిగల అభ్యున్నతికి కట్టుబడి వున్నానని, మాదిగల సంక్షేమం విషయంలో తాను పెద్ద మాదిగలా పనిచేస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/manda-krishna-met-chandrababu-25-183574.html
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.