ఆంధ్రాలో అదుపు లేని ‘పోలీస్‌రాజ్’

Publish Date:Sep 30, 2020

Advertisement

మరో వ్యక్తిని ఎత్తుకెళ్లిన తాడేపల్లి పోలీసులు

 

సవాంగ్‌కు సమస్యలు తెస్తున్న అధికారుల అత్యుత్సాహం

 

తమ బాసు వరసగా హైకోర్టు మెట్లెక్కి.. న్యాయమూర్తుల వ్యాఖ్యలతో అవమానాలకు గురవుతున్నా, కింది స్థాయి పోలీసులకు అదేమీ పట్టడం లేదు. ఎమ్మెల్యేల దన్నుతో.. స్థానికంగా తమకు ఎదురులేదని చెలరేగిపోతున్న అధికారుల అత్యుత్సాహం, డీజీపీకి చెలగాటంగా మారింది. హెబియస్ కార్పస్ పేరిట మనుషులను మాయం చేస్తున్న అధికారుల అత్యుత్సాహం, పోలీస్ బాసుకు పితలాటకంగా మారింది. సీఐ-ఎస్‌ఐ స్థాయి అధికారులు.. స్థానికంగా కొందరితో కుమ్మక్కయి, వారి ప్రత్యర్ధులను ఎత్తుకొస్తున్న చందం.. పోలీసుశాఖకు నగుబాటుగా మారింది. దీనిపై హైకోర్టు స్వయంగా డీజీపీని కోర్టుకు పిలిచినా, కింది స్థాయి పోలీసుల తీరులో మార్పు కనిపించడం లేదు. చివరకు ‘ఇది ఖాకీస్ట్రోక్రసీ’నా అని కోర్టు ఘాటుగా ప్రశ్నించినా, కింది స్థాయి అధికారుల తీరులో మార్పు రావడం లేదు.

 

కొన్ని నెలల క్రితం విశాఖపట్నం పోలీసులు.. రెడ్డి గౌతం అనే వ్యక్తిని, ఒక సివిల్ కేసుకు సంబంధించి బెజవాడకు వచ్చి ఎత్తుకెళ్లారు. ఆ సందర్భంలో ఆయన తరఫున వాదించిన లాయర్‌పైనా దాష్టీకం చేశారు. దానిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, డీజీపీ హైకోర్టుకు హాజరుకావలసి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి.. తమ బాసు కోర్టుకు హాజరయ్యారన్న విషయం తెలిసినా, స్థానిక పోలీసుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు.

 

చోడవరం పోలీసస్టేషన్‌లో నివసించే రెడ్డి గోవిందరావు ఇంటిపై, బాకీలకు సంబంధించి కొందరు దాడి చేశారు. అది సీసీ టీవీలోనూ రికార్డయింది.  ఒక ఎస్‌ఐ.. అప్పులిచ్చిన వారితో రాజీ చేసుకోవాలని గోవిందరావుపై ఒత్తిడి చేశారట. సివిల్ కేసు అని తెలిసినా, అది కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసినా, సెటిల్‌మెంట్ ప్రయత్నాలు చేయడం విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారం మీడియాలో కూడా సంచలనం సృష్టించింది. తన ఇంటిపైకొచ్చి కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ సదరు గోవిందరావు, చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ దిక్కులేదు. దానితో మళ్లీ అదే వ్యక్తులు.. తిరుపతిలోని గోవిందరావు వియ్యంకుడి ఇంటికి వెళ్లి, హడావిడి చేశారన్న ఫిర్యాదు వెళ్లింది. అదే ఫిర్యాదు వచ్చినప్పుడే స్పందించి ఉంటే, ఈ చర్యకు అవకాశం ఉండేది కాదు.

 

ఆ తర్వాత గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా కనిపించడం లేదన్న కేసుకు సంబంధించి, డీజీపీ హైకోర్టు వ్యాఖ్యలకు గురికావలసి వచ్చింది. చివరకు మీకు పనిచేయడం చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లమనే కటువు వ్యాఖ్యలు కూడా న్యామూర్తుల నుంచి వినాల్సి వచ్చింది. ఓ కేసు సందర్భంలో డీజీపీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కోర్టు ఆవరణలోనే ఉండాల్సి వచ్చింది.

 

వరసగా, ఇన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా కిందిస్థాయి పోలీసుల బేఖాతరిజంలో మార్పు కనిపించకపోగా, మరింత రెచ్చిపోవడం దారుణం. ఇవన్నీ.. బాసులకు వ్యవస్థపై పట్టు తప్పుతోందన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన, పోకల వెంకయ్య అనే వ్యక్తిని పోలీసులు బుధవారం తెల్లవారుఝామున, ఎత్తికెళ్లిపోవడం కలకలం సృష్టించింది. ఉదయమే ముగ్గురు పోలీసులు వచ్చి సీఐ అంకమ్మరావు పిలుస్తారని జీబులో తీసుకువెళ్లారు. ఇది మీడియాలో రావడంతో పోలీసు బాస్ మరోసారి తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

 

‘‘మేం మా అన్నయ్య కోసం ఉదయం నుంచీ గాలిస్తున్నాం. తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రమణ్యం మమ్మల్ని తరచూ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారు. మేం పెట్టిన కేసు వాపసు తీసుకోమని బెదిరిస్తున్నారు. మాదగ్గర తీసుకున్న డబ్బులు ఇప్పించాల్సింది పోయి, మమ్మల్లే వాళ్లకు డబ్బులివ్వలివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. సచివాలయంలో పనిచేసే వలేటి రవీంద్ర అనే వ్యక్తి, పోలీసు అధికారులతో కుమ్మక్కయి మమ్మల్ని వేధిస్తున్నారు. ఇక పోలీసుల వేధింపు మేం తట్టుకోలేం. మమ్మల్ని కాపాడకపోతే మాకు ఆత్మహత్యనే గతి’ అని బాధితుడి సోదరుడైన మార్కండేయులు వాపోయారు. అందుకే ప్రముఖ న్యాయవాది ఉమేష్‌చంద్రను ఆశ్రయించి, ఆయన ద్వారా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.

 

అయినా తెల్లవారుఘామున తమ ఇంటికి రావడానికి మేమేనయినా దొంగలమా? నేరగాళ్లమా అని ఆయన ప్రశ్నించారు. తమపై ఎలాంటి కేసులు లేవని, ఒక సివిల్ కేసులో పోలీసులు తమపై వేధింపులకు పాల్పడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని డిజిపి సవాంగ్, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని మార్కండేయులు వాపోయారు. ఆ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

(మార్తి సుబ్రహ్మణ్యం)

By
en-us Political News

  
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.