Publish Date:Apr 14, 2026
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. తృణమూల్ కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ వారి పట్ల సవతితల్లి ప్రేమను చూపుతోందన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి, వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారన్నారు.
ముర్షీదాబాద్ జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 13) నిర్వహించిన భారీ ఎన్నికల బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని హల్దియా, ఖరగ్‌పుర్ వంటి ప్రాంతాల అభివృద్ధిని ప్రస్తావించిన అసదుద్దీన్ ఒవైసీ.. ముర్షీదాబాద్ వంటి జిల్లాలో కనీసం ఒక్కటంటే.. ఒక్క ప్రత్యేక ఆర్థిక మండలి కూడా కూడా ఎందుకు ఏర్పాటు కాలేదని విమర్శించారు.
బిజెపి బూచి చూపి.. ముస్లింలలో భయాందోళనలు సృష్టించి ఎన్నికలలో లబ్ధి పొందాలని తృణమూల్ ప్రయత్నిస్తోందన్నారు. రఘునాథ్ గంజ్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ముర్షీదాబాద్ రూపురేఖలు మారుస్తామని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ఎంఐఎం పోరాడుతుందన్న ఆయన, ముర్షీదాబాద్‌లో పారిశ్రామికాభివృద్ధి కోసం ఎంఐఎం అభ్యర్థిని గెలిపిం చాలని కోరారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో అసదుద్దీన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో అసదుద్దీన్ వ్యాఖ్యలు ఎన్నికలలో ఏ మూరకు ప్రభావితం చేస్తాయన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసదుద్దీన్ వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mamata-votebank-politics-with-muslims-25-217315.html
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.