బెంగాల్ రాజకీయాల్లో పట్టు చాటిన మమతా బెనర్జీ.!

Publish Date:Aug 20, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  తృణమూల్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదనీ, ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆమె ప్రజాదరణ చెక్కు చెదరకుండా నిలిచే ఉందనీ తేలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ స్వయంగా పరాజయం పాలయ్యారు. అయినా పొలిటికల్ గా ఆమె బలం, పట్టు అలాగే ఉన్నాయి.  

తాజాగా పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్   ఘనవిజయాన్ని సాధించడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  

బార్ కౌన్సిల్ ఎన్నికల మొత్తం 23  స్థానాలకు గానూ  తృణమూల్ కాంగ్రెస్  15 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని చాటింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడంటే మూడు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.   లెఫ్ట్ ఫ్రంట్ 3 స్థానాలు,   కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకున్నాయి.   బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఎంసీ  ప్రభ  కోల్పోయిందన్న విమర్శలకు బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా చెక్ పెట్టాయని చెప్పాలి.  

Mamata Banerjee, TMC victory, West Bengal Bar Council, Bengal politics, Bar Council election results

By
en-us Political News

  
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.