కొనుగోలు బేరసారాలు కేసీఆర్ డ్రామా.. బండి సంజయ్

Publish Date:Oct 26, 2022

Advertisement

టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ.. ఆ కంపెనీ ఆడే డ్రామాలన్నిటికీ కథ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ అన్నీ కేసీఆరే అంటూ బండి సంజయ్ ఆరోపించారు. తాజాగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అంటూ విమర్శించారు. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ కోనుగోలు బేరసారాల డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ప్రగతి భవన్ దేనని అన్నారు.

అసలు మోయినాబాద్ ఫాం హౌస్ లో ఉన్న వాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారి నిలదీశారు. ఆ ఫాం హౌస్ టీఆర్ఎస్ వాళ్లదేననీ, ఫిర్యాదు చేసిందీ టీఆర్ఎస్ వాళ్లేననీ.. అంటే ఈ కొనుగోలు బేరసారాల డ్రామాలో నిందితులూ, బాధితులూ, ఫిర్యాదు చేసిన వారూ కూడా టీఆర్ఎస్ వాళ్లేనని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కు ఇలాంటి డ్రామాలు బాగా అలవాటని దుయ్యబట్టారు. గతంలో మంతిపై హత్యాయత్నం డ్రామాను రక్తిగట్టించిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. 
బేరసారాలు అంటున్నారు.. మరి ఎమ్మెల్యేలనూ పీఎస్ కు ఎందుకు తరలించలేదు.. వారు నేరుగా ప్రగతి భవన్ కు ఎలా వెళ్లారని నిలదీశారు. ఈ డ్రామాలో పోలీసులూ పాత్రధారులేనని విమర్శించారు.

   ఆ నలుగురు ఎమ్మెల్యేలూ పనికి మాలిన వారనీ, వారినెవరూ కొనరనీ తీవ్ర స్థాయిలో విమర్శించారు తన పార్టీలో కట్టు తప్పుతున్న వారిని బెదరించడానికే కేసీఆర్ ఈ డ్రామా ఆడారన్నారు. ఈ ఎమ్మెల్యేల బేరసారాల బండారం త్వరలో బయటపడుతుందని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. అయినా ప్రభుత్వానికి ధైర్యముంటే ఆ ఫామ్‌హౌజ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సీఎం కేసీఆర్ యాదాద్రిలో  ప్రమాణం చేసేందుకు సిద్ధమా ? అని బండి సంజయ్ సవాల్ విసిరారు.ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లడమే ఇదంతా కేసీఆర్ ఆడించిన నాటకమనడానికి నిదర్శనమన్నారు.  

అసలు పోలీసులు వారిని  ఎలా విడిచిపెట్టారని.. వారి స్టేట్‌మెంట్ అయినా రికార్డ్ చేశారా ? అని ప్రశ్నించారు. అ ప్రగతి భవన్‌కు సంబంధించిన మూడు రోజుల సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.   ఏడాదిలో పడిపోయే ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనేందుకు తాము వంద కోట్లు ఖర్చు పెడితే.. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ఎంత ఖర్చు చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి 9 రోజుల పాటు అక్కడే బస చేసిన కేసీఆర్ ఎవరెవరిని కలిశారు? అన్నది గోప్యంగా ఉంచారనీ, హస్తినలో స్వామీజీలను కేసీఆర్ కలిశారా అని నిలదీశారు. గతంలో రేవంత్ రెడ్డి పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చిన సంగతిని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.  

 ఢిల్లీలోనే ఈ డ్రామాకు రూపకల్పన జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.తమకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.