Publish Date:Feb 10, 2020
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఏబీవీదే ప్రధాన పాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడం... లొంగకపోతే బెదిరింపులకు దిగడం... చివరికి, వాళ్లను తెలుగుదేశం పార్టీలో చేర్చడమే పనిగా ఏబీ వెంకటేశ్వర్రావు పని చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జగన్మోహన్ రెడ్డి మొదలుకొని విజయసాయిరెడ్డి, ఇతర ముఖ్యనేతలంతా ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఏబీ వెంకటేశ్వర్రావుతోపాటు అప్పటి సీఎంవో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రపైనా ఇలాంటి ఆరోపణలే చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వర్రావు, సతీష్ చంద్ర కీలక పాత్ర పోషించారనేది ఆనాడు వైసీపీ ప్రధాన ఆరోపణ. చివరికి వీళ్లిద్దరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో, ఆనాటి సీఎస్ పునేఠాతోపాటు ఏబీ వెంకటేశ్వర్రావుపై ఈసీ బదిలీ వేటేసింది. అయితే, తనపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వర్రావు పరువునష్టం దావా వేస్తానని ఆనాడు ప్రకటించారు.
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఏబీ వెంకటేశ్వర్రావు, సతీష్ చంద్ర కీలక పాత్ర పోషించారంటూ ప్రతిపక్షంలో ఉండగా ఆరోపణలు చేసిన వైసీపీ.... అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా వ్యవహరించింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర్రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఎనిమిది నెలలుగా వెయిటింగ్ లో పెట్టిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేసింది. అయితే, అలాంటి ఆరోపణలనే వైసీపీ నుంచి ఎదుర్కొన్న సతీష్ చంద్రకు మాత్రం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. అంతేకాదు, త్వరలో సతీష్ చంద్ర.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదంటున్నారు.
అయితే, ఉత్తరాది వాసైన సతీష్ చంద్రకు పోస్టింగ్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.... కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర్రావుపై మాత్రం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఇది మంచి పద్ధతి కాదని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర్రావే కాదు... కమ్మ సామాజికవర్గానికి చెందిన సీఐలు, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీలకు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తీరు చూస్తుంటే కావాలనే కమ్మ వర్గాన్ని అణచాలని చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/malladi-vishnu-sensational-comments-on-ab-venkateswara-rao-25-94073.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.