తిరుపతిలో మల్లారెడ్డి వర్సిటీ.!

Publish Date:Jul 11, 2026

Advertisement

 తెలంగాణ రాజకీయాల్లో, విద్యా రంగంలో  ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న  విద్యావేత్త, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇప్పుడు   ఆంధ్రప్రదేశ్ లో తన విద్యాసంస్థల ఏర్పాటుపై   దృష్టి సారించారు.  ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు చామకూర మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ విద్యా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని రకాల అధికారిక అనుమతులు  లభించాయని వెల్లడించారు. 

శుక్రవారం (జులై 10)  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి,  మీడియాతో మాట్లాడుతూ   గత మూడున్నర దశాబ్దాలుగా  విద్యా రంగంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ నిరంతర సేవలు అందిస్తున్నానన్న ఆయన.. పవిత్ర తిరుపతి నగరంలో ఒక అద్భుతమైన యూనివర్సిటీని స్థాపించాలనేది తన స్వప్నమని చెప్పారు. ఆ స్వప్నం ఇప్పుడు సాకారం అవుతోందన్నారు.  నిజానికి గత ఏడాదే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన   ఆలోచన చేశాననీ,  అది  ఇప్పుడు కార్యరూపం దాల్చిందని మల్లారెడ్డి చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు,  మెడికల్ కాలేజీలు మరియు డీమ్డ్ యూనివర్సిటీలతో అత్యంత బలమైన విద్యా నెట్‌వర్క్‌ను నిర్మించుకున్న మల్లారెడ్డి..  ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విస్తరణ ప్రణాళికల్లో భాగంగానే ఆయన గతేడాది తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. అంతటితో ఆగకుండా, అదే ఏడాది నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లోని మరో కీలక నగరమైన విశాఖపట్నంలోనూ ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా..  దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రమాణాలతో కూడిన మరిన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నదే తన  లక్ష్యమని ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పారు.  

Malla Reddy Varsity in Tirupati, Tirupati Deemed University, Malla Reddy AP Colleges, Medchal MLA, University Expansion, Malla Reddy Educational Institutions

By
en-us Political News

  
మా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అంటూ తల్లిదండ్రుల ఆవేదన..!
షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖనిజాభివృద్ధి రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు మరియు దేశంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా మార్చేందుకు
భారత రాజకీయ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే.. స్వాతంత్ర్యానంతరం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పిన అరుదైన నాయకులలో
తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి కాలరీస్ సంస్థ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల స్వార్థ రాజకీయాలే కారణమని
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సినీ వర్గాల్లో ఒకే ఒక్క వార్త విపరీతంగా హల్‌చల్ చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామ పరిధిలో ప్రతిపాదిత చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు
జూలై 23న భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త మెర్సిడెస్ఏ ఎమ్‌జీ ఇ 53 హైబ్రిడ్ 4మ్యాటిక్ లగ్జరీ స్పోర్ట్స్ కారు యొక్క అదిరిపోయే రేంజ్, స్పీడ్, ఇంజిన్ మరియు ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం.
హైదరాబాద్ మహానగరంలో ఉరుకులు పరుగుల జీవితం సాధారణం.
షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌కు సంబంధించిన కీలక విషయాలు దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి
క్వార్టర్ 1 లో ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభం 17% వృద్ధి చెంది రూ. 1469 కోట్లకు చేరింది. రూ. 11608 కోట్ల ఆదాయం, 1.68 బిలియన్ డాలర్ల కొత్త ఆర్డర్లతో దూసుకుపోతున్న ఈ ఐటీ స్టాక్‌పై బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ ఇక్కడ చూడండి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి టీజీ20 లీగ్ ముగిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.