రైత‌న్న‌కు ఎంతకష్టం.. ఎంతకష్టం!?

Publish Date:May 1, 2026

Advertisement

అన్న‌దాత సుఖీభ‌వ అంటారు. కానీ పరిస్థితి చూస్తుంటే.. అన్నదాతా దుఖీభ‌వ‌లా మారిపోయింది.  తెలంగాణలో వ్య‌వ‌సాయ ప‌రంగా నెలకొన్న ప్ర‌స్తుత‌ పరిస్థితులు రేవంత్ స‌ర్కార్ కి సవాలుగా మారాయి. ఒకవైపు అసాధారణమైన ఎండలు.. మరోవైపు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ఎదురవుతున్న సాంకేతిక, రాజకీయ అడ్డంకులు రైతులను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం.  అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని  వాపోతున్నారు రైతులు.  44 నుంచి  45 డిగ్రీల‌ ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.  రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి..  ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల అవస్థలను చూడాలని డిమాండ్ చేస్తున్నారు  బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హరీష్ రావు.  మే 4 లోపు కొనుగోలు వేగవంతం కాకపోతే ఆందోళనలు తీవ్ర‌త‌రం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  

మొక్కజొన్న పండించిన రైతులు ఈసారి తీవ్ర నష్టాల్లో ఉన్నారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ. 2,400 కాగా.. మార్కెట్‌లో వ్యాపారులు కేవలం రూ.1,600 - రూ.1,800 కే కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా మొక్కజొన్న ఉత్పత్తి పెరగడం, దిగుమతుల వల్ల ధరలు పడిపోయాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని క్వింటాల్‌కు త‌గిన మ‌ద్ధ‌తు ధ‌ర‌ అందించాలని  రైతులు ఆందోళనలకు దిగుతున్నారు.  తెలంగాణను ప్రస్తుతం హీట్ వేవ్  వణికిస్తోంది.  వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎండల వల్ల షార్ట్ సర్క్యూట్లు జరిగి ఎకరాల కొద్దీ మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటనలు వెలుగుచూశాయి. ధాన్యం ఆరబోయడానికి టార్పాలిన్ పట్టాలు లేకపోవడం.. కొనుగోలు కేంద్రాల ద‌గ్గ‌ర‌ కనీస మంచినీటి సౌకర్యం, నీడ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. 

గత వారం జరిగిన ఆర్టీసీ సమ్మె వల్ల రవాణా వ్యవస్థ కొంత స్తంభించింది. సమ్మె విరమించినప్పటికీ, దాని ప్రభావం వల్ల ధాన్యం తరలింపులో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం 6,500 లారీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ధాన్యం మిల్లులకు చేరడంలో ఇంకా ఇబ్బందులున్నాయి. సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని  ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని..  రైతులకు వెంటనే చెల్లింపులు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. మొక్కజొన్న కొనుగోలు కోసం కేంద్రం నుంచి రూ.4 వేల‌ కోట్ల సహాయం కోరిన‌ట్టుగానూ చెబుతున్నారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు.  మే 4న తమిళనాడు, కేరళ ఫలితాల తర్వాత రాజకీయంగా మార్పులు జరిగే అవకాశం ఉంది, అంతలోపే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది.  ఈ సమస్యలు ఎప్పటికి ఒక కొలిక్కి వస్తాయో  చూడాలి.

By
en-us Political News

  
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.