కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే సీరియస్
Publish Date:Jul 4, 2025
                                     Advertisement
గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే నేతలను రాహుల్ గాంధీ, నేను పట్టించుకోమని ఖర్గే తెలిపారు. కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసినవారికే పదవులు అని ఆయన స్పష్టం చేశారు. అందరు నిబంధనలను పాటించాలని అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, దాంతోనే ప్రజల మద్దతు తమకు లభిస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి పదవుల పంపణీనే నిదర్శనమని అన్నారు. అగ్రవర్ణ నేతకు ముఖ్యమంత్రి పదవి, బీసీ వర్గానికి చెందిన తనకు పీసీసీ అధ్యక్ష పదవి, నలుగురు దళితులకు మంత్రివర్గంలో స్థానం, మరో దళిత నేతకు స్పీకర్ పదవి ఇవ్వడమే దీనికి నిదర్శనమని ఆయన వివరించారు.
http://www.teluguone.com/news/content/mahesh-kumar-goud-25-201274.html




 
