తెలంగాణలో ‘మహా ’ తరహా సంక్షోభం ?

Publish Date:Jul 9, 2022

Advertisement

ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్న రోజుల్లో .. ఒకానొక ఆదివారం ఏదో జరిగి పోతుందని ఉహాగానాలు వినిపిస్తున్న సమయంలో... ఆదివారం తర్వాత ఏమి జరుగుతుంది? అనే ప్రశ్నకు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు, చక్కగా నవ్వుతూ సోమవారం వస్తుంది...అని సమాధానం ఇచ్చారు. అయన సరదాగానే ఆ సమాధానం ఇచ్చినా, నిజంగా కూడా అదే జరిగింది. ఆదివారం తర్వాత సోమవారం వచ్చిందే కానీ  ఉహాగానాలు నిజం కాలేదు, ఉసూరు మన్నాయి.  

అప్పటి పరిస్థితి ఆదయితే, ఇప్పడు కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో ఉహాగానాలు ముందు కంటే మహా వేగంగా పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు చాలా వరకు ఉహాగానాల చుట్టూనే తిరుగుతున్నాయి.ఈ మధ్యకాలంలో అయితే ఉహాగానాల జోరు మరింత హుషారుగా సాగుతోంది.  ఇటీవల మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామల నేపధ్యంలో, బీజేపీ నెక్స్ట్ టార్గెట్  తెలంగాణ అనే మాట వినవస్తోంది. నిజమే, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మరి కొందరు బీజేపీ నాయకులు అలాంటి హెచ్చరికలతో కూడిన ప్రకటనలు చేసిన మాట నిజం. అందులో ఒకరిద్దరు తెలంగాణకు  చెందిన కీలక నాయకులు కూడా ఉన్నారని అంటున్నారు.  

ఇక అక్కడి నుంచి మహారాష్ట్రలో, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన విధంగానే, బీజేపీ తెలంగాణ ప్రభుత్వాని సాగనంపేందుకు స్కెచ్ సిద్ధం చేసిందని ఉహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. చివరకు, సహజంగా ఇలాంటి ఉడత ఊపులకు బెదరని, ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా, మీడియాలో షికార్లు చేస్తున్న వదంతులపై స్పందించారు. బీజేపీకి దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని ముట్టి చూడాలని సవాలు విసిరారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాని బీజేపీ కూలిస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని తాము కులుస్తామని, హెచ్చరిక కుడా చేశారు.

అయితే, మహా రాష్ట్రలోలో ప్లే చేసిన ట్రిక్, తెలంగాణలో రీప్లే చేయడం బీజేపీకి సాధ్యమేనా? అక్కడిలా ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టడం అవుతుందా అంటే, అది అయ్యే పనికాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అసలు  బీజేపీ అలాంటి, ‘తప్పు’ చేయదని బీజేపీ సీనియర్ నాయకులు కూడా, ఉహాగానాలను కొట్టేస్తున్నారు. అది నిజం కూడా ఎందుకంటే మహారాష్ట్రకు, తెలంగాణకు అసలు పోలికే లేదు. మహారాష్ట్రలో బీజేపీ ఒక బలమైన పార్టీ. రాష్ట్ర శాసన సభలో వందకు పైగా స్థానాలతో సింగల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజామోదం ఉన్న పార్టీ. నిజానికి 2019 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బీజేపీ, శివసేన కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది.

అయితే ముఖ్యమంత్రి కుర్చీ కొట్లాటలో, శివసేన, బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి, అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులోనూ శివసేన, బీజేపీల మధ్య హిందుత్వ బంధం ఒకటుంది. సో. శివసేనలో చీలిక తెచ్చి , అఘాడి ప్రభుత్వాని కూల్చడం కొంచే ఈజీ అయింది. తెలంగాణలో అలాటి పరిస్థితి లేదు. తెలంగాణ శాసన సభలో తెరాస 103 మంది సభ్యులుంటే బీజేపీ కి ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో.. మహారాష్ట్ర రాజకీయం తెలంగాణాలో సాగదు. నిజానికి  ఈ విషయంలో ఎవరికీ క్లారిటీ ఉన్నా లేకున్నా బీజేపీ జాతీయ నాయకత్వానికి మాత్రం టోటల్ క్లారిటీ ఉందని సో అలాంటి తప్పు చేయదని బీజేపీ సీనియర్లు స్పష్టం చేశారు. 

అయినా ఉహాగానాలు మాత్రం ఇంకా అలా కొనాసగుతూనే ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత  ఏదో జరుగుతుందని ఉహించుకుని, ఏం జరుగుతుంది ? అనే ప్రశ్నలు వేసుకుని,  ఉహాగానాల ఆధారంగా చేస్తున్నవిశ్లేషణలు నిజం కాకపోవచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే, కొంత మంది ఉహిస్తున్నట్లుగా, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత, ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు మొదలవుతాయి, తెరాస చీలిపోతుంది, ఇంకేదో జరుగుతుంది అనుకోవడం పొరపాటే అంటున్నారు. సో... రాష్ట్రపతి ఎన్నిక తర్వాత  ఉప రాష్టపతి ఎన్నిక  వస్తుంది.  అంతే తెలగాణలో మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభానికి మాత్రం ... నో ఛాన్స్ .. అంటున్నారు .

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.