Publish Date:Oct 25, 2024
బీఆర్ఎస్ పార్టీకి పేరుతో పెద్ద చిక్కే వచ్చిపడింది. టీఆర్ఎస్ గా ప్రస్థానం మొదలు పెట్టిన ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు అనుకూలంగా అందరి మద్దతూ పొందింది. సరే తెరాస ఉద్యమాల కారణంగానో.. అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ అనివార్యత వల్లో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్ కంటే.. కోట్లాడి తెలంగాణ సాధించాను అన్న కేసీఆర్ మాటనే ప్రజలు విశ్వసించారు. సరే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు తెరాసకే పట్టం కట్టారు. ఉద్యమ పార్టీగా జనం తెరాసను గుండెల్లో పెట్టుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది కాలానికే తెరాస అధినేత కేసీఆర్.. తెరాస ఉద్యమ కార్యాచరణ ముగిసిందనీ, ఇక తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. అక్కడ నుంచి ఇతర పార్టీల నేతలకు పార్టీ తలుపులు బార్లా తెరిచేసి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు.
సరే రెండో మారు అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తీవ్ర ఆకాంక్షతో పార్టీ పేరును మార్చేశారు. అంటే టీఆర్ఎస్ గా ఆవిర్భవించిన పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారింది. ఆ సందర్భంగా ఆయన చేసిన హడావుడీ, హంగామా అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో బీఆర్ఎస్ ను విస్తరించారు. మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఔరంగాబాద్, నాందేడ్ లలో భారీ బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా, ఆ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిపి దాదాపు 20 లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆ హడావుడి, ఆర్భాటం చూసి మహారాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ అత్యంత కీలకం కాబోతున్నదని అంతా ఊహించారు.
అయితే 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఈ ఓటములతో కేసీఆర్ దాదాపుగా అజ్ణాతవాసంలోకి వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు జంప్ అయిపోయారు. పార్టీలో ఉన్న నేతలకు కనీసం కేసీఆర్ దర్శన భాగ్యం కూడా కలగని పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తమ రాష్ట్రంలో బీఆర్ఎస్ పేరును ఎమ్ఆర్ఎస్ గా మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చేశారు. మహారాష్ట్ర రాజ్య సమితిగా భారత రాష్ట్ర సమితి పేరు మార్పునకు వారు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్, రైతు సంఘాల మద్దతుతో మహారాష్ట్ర ఎన్నికలలో కనీసం80 స్థానాలలో ఎమ్ఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నారు. సో.. కత్తీ పోయి కర్రా వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చే.. బీఆర్ఎస్ పోడి ఎమ్ఆర్ఎస్ వచ్చే అనుకోవాల్సి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maharashtra-brs-decided-to-change-party-name-25-187368.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.