స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు...టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం

Publish Date:May 21, 2026

Advertisement

 

నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం(21-5-26న) మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం, పొలిట్‌బ్యూరో నియామకం తర్వాత తొలిసారి జరిగినఈ సమావేశానికి వర్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. 

ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్‌కు సంబంధించిన ఒక తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ సారి మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. 

టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతో అమలు చేసిన కార్యక్రమాలను మహానాడు వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి సంక్షేమ పథకాన్ని రూపొందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై మహానాడులో సమగ్ర చర్చ జరగాలని దిశానిర్దేశం చేశారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహానాడును నిర్వహించాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.

 కార్యక్రమానికి రెండు రోజుల ముందే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరినీ మహానాడులో భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహానాడు ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలో దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాలకు నివాళులు అర్పించి కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ఎన్టీఆర్ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన రాజకీయ, సామాజిక మార్పులను మహానాడు వేదికగా ప్రదర్శించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.

By
en-us Political News

  
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.