ఈటల రాజేందర్ కారెక్కేస్తారా?.. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అనుకూల గళం సంకేతమదేనా?

Publish Date:Jul 10, 2026

Advertisement

 తెలంగాణ రాజకీయాలలో ఈటల రాజేందర్ పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్ఎస్ హయాంలో కీలక నేతగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా ఈటల కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే. అయితే ఈ తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విభేదాల కారణంగా బీఆర్ఎస్ ను వీడి కమలం గూటికి చేరారు. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీలో ఎలా ఇముడుతారా అన్న చర్చ ఆ సందర్భంగా జోరుగా సాగింది. అయితే ఈటల కమలం పార్టీలో కుదురుకున్నట్లుగానే కనిపించారు. మధ్య మధ్యలో అడపాదడపా ఇబ్బందులు తలెత్తినా సర్దుకున్నారు.  అయితే ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. ఒక దశలో ఆయకు ఆ పదవి దక్కడం ఖాయమని అంతా భావించారు. అయితే అది జరగలేదు. అప్పటి నుంచీ ఈటల రాజకీయంగా మౌనం వహించారు. బీజేపీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదు. 

ఈ నేపథ్యంలోనే ఈటలకు బీజేపీలో ఉక్కపోత ఎక్కువైందన్న  చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగింది. ఆయన కమలం గూటికి వీడతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు.  కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న  రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం  కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్   బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది. 

అయితే.. తాజాగా కాళేశ్వరంపై హైదరాబాద్ లో  మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని  తప్పుపట్టారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మిడ్ మానేరు  అత్యంత కీలకం అన్న ఆయన..   కరవు  ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లోలెవల్ పాయింట్‌కు చేరుతున్న నీటిని ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవడానికి  కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు.  

ఆ సందర్భంగా తాను ఎవరికో భయపడి మాట్లాడే వ్యక్తిని కాదనీ.. తాను  తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారుడినీ అదే తన గుర్తింపనీ ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యల ద్వారా కమలం పార్టీకి తాను కట్టుబానిసను కాననీ, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెళ్లడిస్తాననీ అన్యాపదేశంగానే అయినా విస్పష్టంగా చెప్పారు.  తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమనీ, ఈ తరువాతే.. పార్టీ అని కుండబద్దలు కొట్టారు.   దీంతో  ఈటల రాజేందర్ కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ అధికార పక్షం ఆరోపణలు గుప్పించడం, బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు ఈటలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈటల మళ్లీ కారెక్కే అవకాశం ఉందంటూ రాజకీయవర్గాలలో ప్రచారం జోరందుకుంది.  

Etela Rajender join the BRS, Kaleshwaram Project, BRS Support Rumors, Telangana Politics, BJP MP Etela Comments

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.