రసవత్తరంగా మారిన నాగర్ కర్నూల్ పోరు

Publish Date:Mar 9, 2012

Advertisement

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని వుంది. పోటీచేస్తున్న ముగ్గురిలో ఇద్దరికి అపార రాజకీయ అనుభవం వుంది. మరో అభ్యర్ధి ఇటీవలే రాజకీయ రంగప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పూచకుళ్ళ దామోదర్ రెడ్డి అభివృద్ధి నినాదంతో పల్లె పల్లెలో ప్రచారం చేస్తున్నారు. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నేతలు నాగర్ కర్నూల్ కు ఒరగబెట్టిందేమీ లేడని, తనను ఎన్నుకుంటే నియోజకవర్గ  అభివృద్ధికి కృషిచేస్తామని తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి మర్రి జనార్ధనరెడ్డి అంటున్నారు. తెలంగాణా రాష్ట్రసమితి మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్న నాగం జనార్ధనరెడ్డి ప్రత్యేక తెలంగాణా నినాదంతో రంగంలో ఉన్నారు. అభ్యర్ధుల బలాలు, బలహీనతలు విషయానికి వస్తే....

 

 స్వతంత్ర అభ్యర్ధి నాగం జనార్ధనరెడ్డికి ప్రతి గ్రామంలో అనుచర గణం ఉంది. ఎన్నికల ప్రక్రియ  ప్రారంభం కాకముందే ధూం ధాంల పేరిట నియోజకవర్గం మొత్తం ఇప్పటికే ఆయన పర్యటించారు. ఆయనకు తెరాస, సిపిఐ, బిజెపిలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే ఆయన 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ మంత్రి పదవులు అధిష్టించినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా ఏమీ చేయలేదనే అపవాదు ఉంది. గతంలో నాగం వెంటవున్న కొంతమంది మండలస్తాయి, గ్రామస్తాయి నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం ఆయనకు కొంత ఇబ్బందిగా మారింది.

 

 తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి మర్రి జనార్ధనరెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. తనకు ఒక అవకశంఇస్తే నియోజకవర్గ రూపరేఖలు మార్చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తన పేరిట ఉన్న ఛారిటబుల్ ట్రస్ట్ తో ఏడాదికి ఒక్కో మండలానికి మూడుకోట్ల రూపాయలు వెచ్చించి ఆ మండల అభివృద్ధికి కృషిచేస్తామని, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్ధులకు చదువుకునే అవకాశం కల్పిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు స్తబ్దంగా ఉన్న తెలుగుదేశంపార్టీ కేడర్ లో మర్రి రాకతో ఒక్కసారిగా ఉత్సాహం కనిపించింది. అయితే గ్రామస్థాయిలో ఆయనకు నమ్మకమైన అనుచరగణం గాని, పార్టీకి పెద్దగా కేడర్ గాని లేకపోవడం ప్రధాన ప్రతికూల అంశాలు.
 

 

  కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలో ఉన్న దామోదర్ రెడ్డి వివాద రహితుడిగా, అన్ని వర్గాలను కలుపుకుని పోయే స్వభావం ఉన్నవాడిగా మంచి పేరుంది. మూడుసార్లు ఆయన నాగర్ కర్నూల్ బరిలో దిగి ఓడిపోయిన నేపధ్యంలో ఆయనపై ప్రజలు కొంత సానుభూతి చూపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో ఇతర నాయకుల సహాయ సహకారాలు పెద్దగా లేకపోవడం ఈయనకుగల ప్రధాన ప్రతికూల అంశం.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.