హత్య చేసి డబ్బుల కోసం డ్రామా! ఇంత కిరాతకమా? 

Publish Date:Oct 22, 2020

Advertisement

దారుణం.. అమానుషం.. కిరాతకం. మహబూబా బాద్ లో కిడ్నాపై దారుణహత్యకు గురైన బాలుడి ఘటనపై చెప్పడానికి ఈ పదాలు కూడా తక్కువే. డబ్బుల కోసం ఆశపడి అభం శుభం తెలియని తొమ్మిదేండ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన అందరిని కలిచివేస్తోంది. మానవత్వానికి మచ్చగా , పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలుస్తోంది. బాలుడి తండ్రికి తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడటం మరింత ఆందోళన కల్గిస్తోంది. మహబూబాబాద్ ఘటనతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదోనన్న భయాందోళన జనాల్లో వ్యక్తమవుతోంది. 

 

మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో ఆదివారం అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని కిడ్నాపర్ దారుణంగా హత్య చేశాడని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బాలుడి కిడ్నాప్ జరిగినప్పటి నుంచి మృతదేహం లభ్యంతో పాటు  కిడ్నాపర్ ను పట్టుకున్న వివరాలను ఆయన వివరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో రంజిత్ రెడ్డి పెద్ద కుమారుడు దీక్షిత్ ను మెకానిక్ మందసాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి.. రెండు గంటల్లోనే హత్య చేశాడని తెలిపారు. 

 

నాలుగో తరగతి చదువుతున్న దీక్షిత్ రెడ్డిని తొందరగా డబ్బులు సంపాదించాలన్న దురాశతోనే మందసాగర్ కిడ్నాప్‌ చేశాడని ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. కిడ్నాపర్ తెలిసిన వ్యక్తి కావడం వల్లే బాలుడు పిలవగానే వెళ్లాడని, ముందస్తు ప్రణాళిక ప్రకారం సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచే బాలుడిని తీసుకెళ్లాడని తెలిపారు. దానవయ్య గుట్టకు బాలుడిని తీసుకెళ్లిన మందసాగర్‌కు అతడిని అక్కడ ఉంచడం కష్టంగా మారిందని, దీంతో తనకు పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పవని భావించి, వదిలేసినా బాలుడు తన వివరాలు బయటపెడతాడని భావించి, అతడిని కిడ్నాప్ చేసిన గంట, గంటన్నరలోనే బాలుడిని గొంతునులిమి చంపేశాడని వివరించారు.

 

తమకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం అతడు ఒక్కడే బాలుడి ఇంటి సమీపంలోకి వచ్చి దీక్షిత్ ను తీసుకెళ్లాడని మదబూబా బాద్ ఎస్పీ తెలిపారు.  మంద సాగర్ కు ఓ బైక్‌ ఉందని, దానికి ఫేక్‌ నంబరు తగిలించి బాలుడిని కిడ్నాప్ చేశాడన్నారు. కిడ్నాప్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా ఒకటి తమకు లభించిందని వివరించారు. ఆదివారం సాయంత్రం  మహబూబాబాద్ శివారులోని గుట్టలపైకి బాలుడిని తీసుకెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత బాలుడిని విడిచి పెట్టేందుకు రూ.45 లక్షలు డిమాండ్ చేశాడని వివరించారు.

 

బాలుడిని చంపేసిన రెండు రోజుల తర్వాత కూడా డబ్బు కోసం మందసాగర్ ఫోన్లు చేస్తూనే ఉన్నాడని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నామని సాయంత్రంలోపు పూర్తి స్పష్టత వస్తుందని కోటిరెడ్డి అన్నారు. ఈ కేసులో ఇతర నిందితుల గురించి కూడా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత సాయంతోనే తాము నిందితుడిని పట్టుకుననమని ఎస్పీ చెప్పారు. నిందితుడు ఇంటర్నెట్ కాల్స్ చేసినప్పటికీ తాము హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ సాయంతో పట్టుకున్నామని చెప్పారు. 

 

ఆదివారం కిడ్నాపై దారుణ హత్యకు గురైన బాలుడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ కుమారుడు క్షేమంగా వస్తాడని నాలుగు రోజులుగా ఎదురుచూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ బాలుడి కోసం మొత్తం ఆస్తిని ఇవ్వడానికి సిద్ధమైనా చంపేశారంటూ వారు విలపిస్తుండటం అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది.  డబ్బుల కోసం బాలుడిని ఇంత కిరాతకంగా హత్య చేస్తారా అంటూ స్థానికులు బోరుమంటున్నారు. అభం శుభం తెలియని బాలుడిని హత్య చేసిన కిడ్నాపర్లను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.