మహబూబ్ నగర్ లో మైనార్టీలపైనే కాంగ్రెస్ ఆశలు
Publish Date:Mar 12, 2012
Advertisement
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ పార్టీ త్రీవంగా కృషిచేస్తోంది. అధికార బలంతో పాటు అన్నిరకాలుగా ఓటర్లను ఆకర్షించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా మంత్రి డికె అరుణ, ఇన్ ఛార్జి మంత్రి రామ్ రెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ నియోజకవర్గంలో విజయానికి వ్యూహాలు పన్నుతున్నారు. దీనిలో భాగంగా మైనార్టీ ఓట్లపై వారు ప్రత్యేక దృష్టిపెట్టారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సుమారు 23వేల ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించని మైనార్టీలు ఈసారి తమకు అండగా నిలుస్తారన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీనికితోడు టిడిపి, బిజెపి కూడా ప్రధాన పోటీదారులుగా నిలవడంవల్ల వారి ఓట్లుచీలడంతో పాటు, కాంగ్రెస్ సాంప్రదాయ ఓటుబ్యాంకు మాత్రం చెక్కు చెదరదనే నమ్మకంగా మంత్రులు ఉన్నారు. టిఆర్ఎస్ మైనార్టీ అభ్యర్ధి సయ్యద్ ఇబ్రహీంవల్ల తమకు పెద్దగా నష్టం ఉండదని వారు అంచనా వేస్తున్నారు. మైనార్టీలతో పాటు తెలంగాణా సెంటిమెంట్ కాస్త బలహీనపడటం, టిడిపి, బిజెపిల మధ్య ఓట్లు చీలడం తమకు లాభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/mahabub-nagar-24-12560.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





