పతనం అంచున మహా సర్కార్.. బీజేపీ మద్దతుతో షిండే సర్కార్?

Publish Date:Jun 22, 2022

Advertisement

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ సర్కార్ కుప్పకూలిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలున్నారని స్పష్టం చేస్తున్నారు. వీరిలో 34 మంది శివసేన వారు కాగా మిగిలిన ఏడుగురూ స్వతంత్రులని చెబుతున్నారు. నిన్నటి వరకూ తన మద్దతుదారులతో సూరత్ లో క్యాంప్ వేసిన షిండే ప్రస్తుతం గువహటి చేరుకున్నారు.

సూరత్ నుంచి ప్రత్యేక విమానంలో గువహటి చేరుకున్న రెబల్ ఎమ్మెల్యేలు హైలెవెల్ సెక్యూరిటీ మధ్య ఓ హోటల్ లో బస చేశారు. షిండేతో మంగళవారం పలు దఫాలు మహా సీఎం ఉద్ధవ్ థాక్రే ఫోన్ లో సంభాషించినా సమస్య పరిష్కారం కాలేదు. షిండే తమదే అసలైన శివసేన అని చెబుతున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే కు నిజమైన రాజకీయ వారసులం తామేనని, ఆయన అనుసరించిన హిందుత్వ విధానానికే తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. గువహటి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఏక్నాథ్ షిండే.. బాల్ థాక్రే హిందుత్వ అజెండాతో తాము ముందుకు సాగుతామని   విస్పష్టంగా చెప్పడం చూస్తుంటే శివసేనలో చీలిక అనివార్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అదే జరిగితే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోవడం అనివార్యమంటున్నారు.  మహా వికాస్‌ అగాఢీ ప్రభుత్వ భవిష్యత్ గురించి అప్పుడే ఏం మాట్లడబోనని అన్న షిండే తన మద్దతుదారులతో కలిసి  ముంబై వెళ్లనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం మహారాష్ట్ర గవర్నర్‌తో షిండే భేటీ కానున్నారు. తనతో 2/3 పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, దీంతో శివసేన పార్టీ తనదేనని ఆయన క్లయిమ్‌ చేసుకునే అవకాశం ఉందని ఆయన మాటల ద్వారా అర్థమౌతోంది. బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు షిండే లేఖ ఇచ్చే అవకాశం ఉందనీ, అనంతరం  బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తారని విశ్లేషిస్తున్నారు.  

బుధవారం ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్ఠానాన్ని కలుసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే శివసేన తిరుగుబాటు శాసన సభ్యులందరూ గుజరాత్‌ను వీడి అసోంకు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

By
en-us Political News

  
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.