మహా సీఎం అజిత్ పవార్?.. రాజీనామా కారణమదేనా?

Publish Date:May 4, 2023

Advertisement

మరాఠా యోధుడు, రాజకీయ వ్యూహాల దురంధరుడు ఉరుములేని పిడుగులా సొంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. పార్టీ శ్రేణులు ఆయనే కొనసాగాలని చేసిన డిమాండ్ లను కూడా పట్టించుకోకుండా తన వారసుడి ఎంపిక కోసం ఒక కమిటీని కూడా వేసేశారు.  అయితే ఎన్సీపీ అధ్యక్ష రేసులో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె ముందు వరుసలో ఉన్నారు.

ఈ వ్యవహారంపై గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. చెప్పా పెట్టకుండా శరద్ యాదవ్ ఎందుకింత హఠాత్తుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే మహారాష్ట్ర రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారు మాత్రం ఒక మహా ఎత్తుగడతోనే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారంటున్నారు. ఆయన రాజీనామా.. తదననంతర పరిణామాలపై పక్షం రోజుల కిందటే సుప్రియా సూలే హింటిచ్చారు. మహా, జాతీయ రాజకీయాలలో రానున్నరోజుల్లో రెండు భూకంపాలు సంభవిస్తాయని ఆమె చెప్పారు. అవేమిటన్నదానిపై విశ్లేషకులు యిప్పుడు క్లారిటీ యిస్తున్నారు.  

కర్నాటక ఎన్నికల తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవించనున్నాయంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో  గెలిచి మోడీ ముచ్చటగా మూడో సారి కేంద్రంలో మోడీ  నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్న బీజేపీ.. మహాలో  షిండే ప్రభుత్వ తీరు పట్ల గత కొంత కాలంగా ఒకింత అసంతృప్తితో ఉంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలన్న యోచనలో ఉంది. యిది పసిగట్టిన షిండే.. ప్రతి వ్యూహాలతో ఉద్ధవ్ థాక్రేకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు.

శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఈ నేపథ్యమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని అంటున్నారు. అందుకు గత కొంత కాలంగా ఆయన ప్రకటనలనే సాక్ష్యంగా చూపుతున్నారు. అదానీ వ్యవహారంలోనూ, మోడీ విద్యార్హతలపై తలెత్తిన వివాదంలోనూ ఆయన విపక్ష గళానికి భిన్నంగా తన వాణిని వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కమలం గూటికి దగ్గరౌతున్నారన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. యిదిలా ఉండగా.. తన సమీప బంధువు అజిత్  పవార్ సీఎంగా మహాలో బీజేపీ సర్కార్ ఏర్పాటుకు ఆయన రాజీనామా నాంది అని అంటున్నారు. సెక్యులర్ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న శరద్ పవార్ తాను అధ్యక్షుడిగా ఉండగా తానే ఏర్పాటు చేసిన పార్టీ బీజేపీతో జట్టు కట్టిందన్న అపప్రదను మూటగట్టుకోవడం ఎందుకన్న భావనతోనే తాను రాజీనామా చేసి ఆ స్థానంలో తన కుమార్తెను కూర్చోపెట్టి క్రతువు కానిచ్చేద్దామని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్యతను ముందుండి నడిపిస్తారనుకున్న శరద్ పవార్ యూటర్న్ తీసుకుని బీజేపీ పంచన చేరడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.