బసవతారకం క్యాన్సర్ హాస్పటల్.. ఒక మహోన్నత మానవతా ఉద్యమం!

Publish Date:Jun 22, 2026

Advertisement

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు  చేపట్టిన మానవతా ఉద్యమంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం.  నాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉద్యమంగా  ముందుకు తీసుకువచ్చిన ఆయన సమాజంలో పేదరికంతో బాధపడుతున్న ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించాలనే సంకల్పంతో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.  తన జీవిత భాగస్వామి అనుభవించిన ఆ క్యాన్సర్ వేదనను మరే పేద కుటుంబం   అనుభవించకూడదన్న పట్టుదలతో ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని స్థాపించారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవ ఉద్యమమైతే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒక గొప్ప మానవతా ఉద్యమం.  

ఈ రెండు  సంస్థల స్థాపన వెనుక ఎన్టీఆర్  దూరదృష్టి, గొప్ప సేవా తత్వం దాగి ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి.. సిల్వర్ జూబ్లీ వేడుక సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని.. గత పాతికేళ్లుగా ఈ ఆసుపత్రి లక్షలాది మంది క్యాన్సర్ బాధితుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతూ, ఒక కొండంత ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు. మధ్యతరగతి ప్రజలకు   అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమన్న ఆయన.. నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి   ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేశారనీ,  అది నాడు ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడులపై ఉన్న అపార గౌరవానికి నిదర్శనమనీ చెప్పారు. ఆస్తులకు వారసులు ఎందరో ఉంటారు కానీ..  తల్లిదండ్రుల మహోన్నత ఆశయాలకు వారసులు కొందరే ఉంటారు. ఆ ఆశయాలను అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్నారు  నందమూరి బాలకృష్ణ అని పెమ్మసాని చంద్రశేఖర్  ప్రశంసించారు.

ఒక చిన్న మొక్కగా ప్రారంభమైన ఈ సేవా క్షేత్రం నేడు ఒక మహా వృక్షంగా మారింది. కేవలం 100 పడకలతో  మొదలైన   బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, నేడు ఏకంగా 650 పడకల భారీ స్థాయికి ఎదగడం   గర్వకారణం. నేటి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీతో పోలిస్తే..  ఇక్కడ ఏకంగా 40 శాతం తక్కువ వ్యయంతోనే రోగులకు అత్యుత్తమ,  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందుతున్నాయి. కేవలం గొప్ప ఆలోచనలు ఉంటే సరిపోదు, దానికి పటిష్టమైన కార్యాచరణ తోడైనప్పుడే అది తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ ప్రయాణం నిర్ద్వంద్వంగా నిరూపించిందని పెమ్మసాని చెప్పారు. 

హైదరాబాద్ లో  హైటెక్ సిటీ అభివృద్ధి చెందినా, బయోటెక్నాలజీ రంగం విస్తరించినా, ఐఐటీ మరియు ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు అంతర్జాతీయ గుర్తింపు సాధించినా.. అవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు. అప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చూపించిన అద్భుతమైన దార్శనికత, నిరంతర పర్యవేక్షణ, అంకితభావానికి   సజీవ సాక్ష్యాలన్నారు. నేడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం తెలుగువారందరికీ ఒక పండుగ లాంటిది. రాబోయే రోజుల్లో కూడా ఈ సంస్థ మరింత మంది ప్రాణాలను రక్షించి, మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలవాలని  పెమ్మసాని ఆకాంక్షించారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని
ఈ నెల 25న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం ఉదంతంలో ఎట్టకేలకు ఒక కీలకమైన పురోగతి లభించింది.
స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి..గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.