జూబ్లీ కాంగ్రెస్ బరిలో మిగిలింది ముగ్గురే?

Publish Date:Oct 5, 2025

Advertisement

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్ధుల జాబితాలో నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను ఇన్‌చార్జ్ మంత్రులు షార్ట్‌లిస్ట్ చేశారు. ఇన్‌చార్జ్ మంత్రులు  షార్ట్‌లిస్ట్ ఫైనల్ చేశారు. అనంతరం స్కీనింగ్ కమిటీకి ఈ జాబితాను టీపీసీసీకి పంపనుంది. ఇదిలా ఉంటే మొదటి నుంచి జూబ్లీహిల్స్ బైపోల్ లో పోటీలో బరిలొ ఉండబోతున్నట్లు ప్రచారం చేసుకున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు షార్ట్ లిస్టులో లేకపోవడం ఆయనకు షాక్ ఇచ్చినట్లైంది. తాజా రాజకీయ పరిణామాలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌  రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అధికార పక్షం కావడంతో  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. 

మరోవైపు  బీఆర్‌ఎస్  పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత  బరిలో నిలుస్తుందని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థి ఎంపిక కోసం కమలం పార్టీ  పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు  త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో  మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. 

మరోవైపు బీజేపీ నుంచి బరిలో దిగేందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, కిలారీ మనోహర్ టికెట్ ఆశిస్తున్నారు. మరోసారి తెరమీదకు వచ్చిన అజారుద్దీన్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి న్యాయ పరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్  పోటీలో ఎలగైన నిలవాలని  పోటీలో భావిస్తున్నారు. మరోవైపు మైనార్టీ నేతలతో అజార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనను బరిలో నుంచి తప్పించేందుకు ఓ మంత్రి ప్రయత్నించాడు అని అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి పేరుతో పక్కకి తప్పించే కుట్ర జరుగుతుందని ఆయన వాపోయారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ కలిసి వస్తుండటంతో కాంగ్రెస్‌కు విజయావకాశాలపై ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే  ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్‌ చైర్మన్లు రంగంలో దిగారు.


 

By
en-us Political News

  
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.