పెళ్లై 19 ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదని.. విడాకులు కోరిన భర్తను కోర్టు ఏమందంటే.!

Publish Date:Oct 13, 2026

Advertisement

సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పిల్లలు పుట్టకపోవడాన్ని భార్య చేసిన తప్పుగా పరిగణించలేమని, దానిని భర్తపై మానసిక క్రూరత్వంగా ఆపాదించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వివాహం అనేది కేవలం సంతానోత్పత్తి కోసమే కాదని, సంతానం లేదన్న ఒక్క కారణంతో వైవాహిక బంధంలో భాగస్వామి విఫలమైనట్లు నిర్ధారించలేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

చెన్నైకి చెందిన ఓ దంపతుల విడాకుల కేసులో ఈ తీర్పు వెలువడింది. తమకు వివాహమై చాలా ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదని, భార్య తనను బహిరంగంగా దూషించడంతో పాటు చెప్పుతో కొట్టిందని ఆరోపిస్తూ భర్త విడాకులు కోరారు. అయితే, తాను వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించానని భార్య కోర్టుకు వివరించింది. తన గర్భాశయంలో 8 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్ సమస్య ఉన్నప్పటికీ శస్త్రచికిత్స చేయించుకున్నానని, ఫెర్టిలిటీ చికిత్సలు, హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకున్నానని తెలిపింది. సంతానం కోసం ఆమె ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదనను న్యాయస్థానం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది.

ఫెర్టిలిటీ చికిత్స అనేది సాధారణ వైద్య ప్రక్రియ కాదని ధర్మాసనం పేర్కొంది. తరచూ స్కానింగ్‌లు, రక్త పరీక్షలు, ఇంజెక్షన్ల కారణంగా మహిళలు శారీరక ఇబ్బందులతో పాటు తీవ్ర భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొంటారని వివరించింది. ఇన్ని కష్టాలు భరిస్తూ భార్య చికిత్సలు చేయించుకోవడం, వైవాహిక బంధాన్ని కొనసాగించాలన్న ఆమె ప్రయత్నానికి నిదర్శనమని స్పష్టం చేసింది. దీనిని మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంది.

హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం మానసిక క్రూరత్వాన్ని విడాకులకు ప్రాతిపదికగా చూపాలంటే తగిన ఆధారాలు అవసరం. భర్త చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని భావించిన మద్రాసు హైకోర్టు ఆయన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది.

సుప్రీంకోర్టు న్యాయవాది అమిత్‌రాజ్ కౌశల్ అభిప్రాయం ప్రకారం, కేవలం సంతానం కలగలేదన్న కారణంతోనే విడాకులు పొందలేరు. విడాకులు కోరే వ్యక్తి తన వాదనకు చట్టపరమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. మొత్తంగా, సంతానలేమి లేదా ఫెర్టిలిటీ చికిత్సలు విఫలమవడాన్ని మాత్రమే మానసిక క్రూరత్వంగా పరిగణించలేమన్న ఈ తీర్పు వైవాహిక బంధాల్లో మహిళలపై సంతానం విషయంలో నిందలు మోపే ధోరణిపై కీలక సందేశాన్ని ఇస్తోంది.

 

 

[ Madras High Court, Divorce Case, Childless Marriage, Mental Cruelty, Hindu Marriage Act 1955, Section 13(1)(ia), Fertility Treatment, Infertility, Husband Wife Dispute, Divorce Petition, Chennai Couple, High Court Verdict, Marital Rights, Supreme Court Advocate Amit Raj Kaushal, Telugu News, Telugu One News ] 

By
en-us Political News

  
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.