చిన్నారి అంత్యక్రియలకు ముందే హంతకుడు మృతి

Publish Date:Feb 18, 2026

Advertisement

 

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ హత్యకు గురైన బాలిక అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ  ఆమె స్వగ్రామమైన కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో నిర్వహించారు. కడసారి వీడ్కోలకి బంధువులు, స్థానికులు, అన్నమయ్య, కడప జిల్లాల టీడీపీ నేతలు హాజరయ్యారు. అందరూ కన్నీటితో బాలికకు ఆఖరి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు ముందే, ఈ కేసులో నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు. అన్నమయ్య జిల్లా కరసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభించింది. 

స్థానికుల సమాచారంతో ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడి మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి పరారైన కులవర్ధన్ బాలిక అంత్యక్రియలకు ముందే మరణించడంపై మృతురాలి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు  హోంమంత్రి అనిత మాట్లాడుతు చిన్నారిపై ఘాతుకాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని అన్నారు. నిందితుడు కులవర్ధన్  గంజాయికి అలవాటు పడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని హోంమంత్రి తెలిపారు. 

నిందితుడిని మంగళవారం తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడని.. ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా కనసానివారిపల్లె చెరువులో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైందని  ఎస్పీ ధీరజ్‌  తెలిపారు. మదనపల్లి చిన్నారిపై నిందితుడు ఆత్మహత్యపై తెలుగుదేశం పార్టీ ఆసక్తికర పోస్ట్ చేసింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే సీఎం చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది. 

By
en-us Political News

  
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం నాడు ఒక భారీ పారిశ్రామిక దుర్ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో ఆదివారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు
బీజేపీ నా సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అన్నారు.
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.