నాన్నా విదేశాలకు వెళ్లిపోదాం పదండి.. ఇదీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చేస్తున్న కొత్త ప్రతిపాదనగా పార్టీ వర్గాలు, పరిశీలకులు అంటున్నారు. బీజేపీ నేత సీఎం రమేష్ రహస్యాలన్నీ బయట పెట్టేశారు.. అవి మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు ఫోన్ ట్యాపింగ్, సహా పలు కేసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అరెస్టు తప్పదన్న ప్రచారమూ జోరుగా ఉంది. అంతే కాకుండా అన్ని కేసుల దర్యాప్తులూ చివరి దశకుచేరుకుంటున్నాయి. రీసెంట్ గా కాళేశ్వరం కర్త- కర్మ- క్రియ అన్నీ కేసీఆరే అంటూ కాళేశ్వరం కమిషన్ నివేదికను ఉటంకిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రముఖంగా ప్రచురించింది. ఇలా అన్ని ఇబ్బందులూ, కష్టాలూ ఏకకాలంలో చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇక్కడే ఉంటే అవమాన భారం తప్పదన్న భావనతో కేటీఆర్ విదేశాలకు పోదాం అన్న ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికే కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్ ముందు యూఎస్, యూకే, దుబాయ్ వంటి ఆప్షన్లు ప్రతిపాదించారట ఇంత చేశారు. సంపాదించారు. వాటిని లక్కీభాస్కర్ సినిమాలో ఆ హీరో లాఎస్కేపై సేఫ్ గా ఉందామన్నదే కేసీఆర్ ప్రతిపాదనగా చెబుతున్నారు. అయినా ఇదేమైనా జరగనిదా? గతంలో బ్రిటీషర్లు కూడా అంతేగా.. 3 లక్షల కోట్ల మేర పడవల్లో సర్దేసుకుని మన సంపదతో ఉడాయించారు. వాళ్లేమైనా మనలాగా రాష్ట్ర సాధన చేశారా? మన దేశమే మనికిచ్చి వెళ్లిపోయారు. అదే మనం రాష్ట్రాన్ని సాధించాం. ఎప్పటికీ మీరే సీఎంగా ఉంటారని నమ్మాం. కానీ జనం కాంగ్రెస్ కి అధికారమిచ్చి మనకు జలక్ ఇచ్చారు. అలాంటి జనానికి మనమూ ఓ జర్క్ ఇద్దాం. దానికి తోడు ఇదేమైనా కొత్తా.. మొన్నటికి మొన్న మనకన్నా ముందే ప్రభాకర్ రావు యూఎస్ చెక్కేయలేదూ.. మనమూ అలాగే వెళ్లిపోదాం అన్నది కేటీఆర్ వాదనట.
అంతా బాగుంది కానీ ఇంత బతుకు బతికి అక్కడెక్కడో దేశం గాని దేశానికెళ్లి సెటిలవడమేంటన్నది కేసీఆర్ అభ్యంతరమట. ఇక్కడే ఉందాం... నేనుండే వరకూ నన్ను వేధిస్తారు. ఆ తర్వాత అంతా మరచి పోతారు. నువ్వు నీ కుటుంబం, నీ చెల్లి బావ, ఇతర బంధుమిత్రులు హ్యాపీగా బతకొచ్చు. కాబట్టి ఏం నారాజ్ కావద్దని కేసీఆర్ కేటీఆర్ ను సముదాయిస్లున్నారట. మరి ఈ అటలో ఎంత వరకూ వాస్తవం ఉందో.. కేసీఆర్ జైలుకెళ్తారా? ఆ అవమాన భారాన్ని మోస్తారా? చూడాల్సి ఉందంటున్నారు పరిశీలకులు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/luckey-bhasker-scheme-in-brs-39-203406.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.