Publish Date:Aug 29, 2024
హైదరాబాద్ నగరంలో మరో కామోన్మాది రెచ్చిపోయాడు. ఒక యువతిని దారుణంగా హత్య చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గచ్చిబౌలి ప్రాంతంలోని గోపనపల్లి తండాలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది దాడి చేయడంతో దీపన తమాంగ్ అనే 32 సంవత్సరాల యువతి మరణించింది. ఉన్మాది దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘోరం జరిగింది.
కర్ణాటకలోని బీదర్‌కి చెందిన రాకేష్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన దీపన తమాంగ్‌కి కొన్నేళ్ళుగా పరిచయం వుంది. రాకేష్, దీపన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. తనను పెళ్ళి చేసుకోవాలని దీపనని రాకేష్ చాలాకాలం నుంచి అడుగుతున్నాడు. అయితే దీపన నిరాకరిస్తోంది. బుధవారం రాత్రి దీపన ఇంటికి రాకేష్ వెళ్లాడు. అక్కడే ఉన్న కూరగాయల కత్తితో దీపనపై దాడి చేశాడు. దీంతో దీపన అక్కడికక్కడే మరణించింది. అడ్డుకునేవారి మీద కూడా రాకేష్ దాడి చేయడంతో వాళ్ళు కూడా గాయపడ్డారు. దాడి తర్వాత రాకేష్ మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించడంతో షాక్ తగిలి గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు రాకేష్‌ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/love-attack-girl-death-25-183849.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.