యువకుడికి ప్రాణాల మీదకు తెచ్చిన డీజే మోత!
Publish Date:May 21, 2026
Advertisement
పండగలు, పార్టీలు, వివాహ వేడుకలు అంటే ఇప్పుడు డీజే సౌండ్లు తప్పనిసరి అయిపోయాయి. భారీ స్పీకర్ల మోతకు యువత ఉత్సాహంగా , సంతోషంగా డాన్స్ చేస్తూ వేడుకలను హుషారుగా మార్చేస్తు న్నారు. అయితే ఈ అధిక శబ్ద కాలుష్యం ప్రాణాలకే ముప్పు అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యులు ఆ యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు, అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వ హించి.. డీజే బాక్సుల నుంచి వచ్చిన తీవ్రమైన శబ్ద ఒత్తిడి కారణంగా ఆ యువకుడి మెదడులోని సున్నిత మైన రక్తనాళాలు చిట్లి, రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మొరుగైన వైద్య చికిత్స కోసం అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అధిక శబ్దం కేవలం చెవులపై మాత్రమే కాకుండా మెదడు, గుండె, నరాల వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపు తుందని వైద్యులు హెచ్చరి స్తున్నారు. ముఖ్యంగా భారీ డీజే బాక్సుల నుంచి వెలు వడే హై డెసిబెల్ సౌండ్స్ వల్ల రక్తపోటు పెరగడం, గుండె స్పందనలు అసా ధారణంగా మారడం, మెదడుపై ఒత్తిడి పెరగడం వంటి ప్రమాదాలు ఉంటా యని చెబుతున్నారు. పండగలు, వివాహ వేడుకల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతిలేని డీజే సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
ఖమ్మం జిల్లా నారాయణపురం ఎస్సీ కాలనీలో ఓ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా భారీ డీజే సిస్టమ్ ఏర్పాటు చేశారు. హై డెసిబెల్ శబ్దాలు, భారీ బేస్ మోత మధ్య యువకులు ఉత్సా హంగా డాన్స్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ యువ కుడు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
http://www.teluguone.com/news/content/loud-dj-music-puts-young-mans-life-in-danger-36-220473.html





