కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు.. ఇక అరెస్టేనా?

Publish Date:May 22, 2025

Advertisement

మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని  వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే  దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.   కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయ వంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ  గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు  తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. నాలుగైదు రోజుల కిందట మాత్రం కొడాలి నాని ముంబై నుంచి తిరిగి వచ్చారనీ, హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారనీ వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిర్దారణ కాలేదు.

అయితే కేసుల భయంతో వణికిపోతున్న కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన పట్ల ఎక్కడా సానుభూతి వ్యక్తం అవుతున్నదాఖలాలు లేవు. చివరికి పార్టీ అధినేత జగన్ కూడా కొడాలి నానిని పరామర్శించలేదు. అనారోగ్యం అన్నంత మాత్రాన కేసులు వదిలిపెట్టవన్న సంగతి అర్ధమైన కొడాలి నాని తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్నా అరెస్టు తప్పదన్న భయంతో నాని విశ్రాంతి పేరుతో విదేశాలకు చెక్కేయాలని భావిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యింది.  అయితే ఇప్పుడు కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన తరువాత ఆయన ఎక్కడున్నారు? ఇప్పటికే విదేశాలకు చెక్కేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఏది ఏమైనా కొడాలి నాని కేసుల విషయంలో దర్యాప్తు వేగం పుంజుకుందనీ, ఆయన అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారనీ తాజాగా జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల ద్వారా తెలుస్తోంది. 

By
en-us Political News

  
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంకారావు అనే వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయనను.. ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్టు అక్కడికక్కడే ప్రకటించి సీఎం చంద్రబాబు ఓ సంచలనమే రేపారు.
యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబ‌ర్ ఏ1315 బోయింగ్ 7878 డ్రీమ్ లైన‌ర్ చిన్న సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో తిరిగి హాంకాంగ్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌కటించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికుల గుండెలు అర‌చేతిలోకి వ‌చ్చేశాయి.
ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్నది. ఇరుదేశాలు దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ఇరాన్‌ ధ్వంసం చేసింది. ఇరాన్‌ ఇంతకాలం హమాస్, హెజ్బొల్లా వంటి ప్రాంతీయ శక్తులను ఇజ్రాయెల్‌ పైకి ఎగదోసేది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేరుగా ఇరాన్‌పై దాడికి దిగింది.
రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన నంబర్ టు అనుకుంటారు.. అన్ని శాఖలు తనవే అనుకుంటారు.. హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో ఉంటారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందా అంటే అదీ లేదు. కాని ఆయన సఖల శాఖలపై ప్రకటనలు చేస్తారు.
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్ దాడులతో జనం తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన దారుణం కుప్పం పరిధిలోని నారాయణపురంలో జరగింది.
ఫోన్ ట్యాపింగ్ విచార‌ణాధికారులైన డీసీపీ విజ‌య్ కుమార్, ఏసీపీ వెంక‌ట‌గిరి  ప్రభాకరరావును విచారించడంలో కొత్త టెక్నిక్ వాడుతున్నారు.  
శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (జూన్ 17) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎటీజీహెచ్ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో సికింద్రాబాద్‌ సన్‌ సైన్‌ ఆసుపత్రిలో హరీశ్‌రావు చేరారు
అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.