Publish Date:May 21, 2025
ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫుల్ గా క్లాస్ పీకారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని దాదాపుగా హెచ్చరించినంత పని చేశారు. ఎందుకంటే.. సోమవారం (మే 19)న గ్రేటర్ విశాఖ మునిసిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేని కారణంగా వాయిదా పడింది.
అలా వాయిదా పడటానికి కారణం కొందరు తెలుగుదేశం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడమే. అసలు విషయమేంటంటే... వైసీపీ జమానాలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీయే దక్కించుకుంది. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలై, అధికారం కోల్పోయింది. తెలుగుదేశం కూటమి అద్భుత విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టింది. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలలో వైసీపీ కార్పొరేటర్లు పలువురు ఆ పార్టీని వీడి కూటమి పార్టీల పంచన చేరారు. వారిలో అత్యధికులు తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో జీవీఎంసీపై తెలుగుదేశం పట్టు సాధించింది. జీవీఎంసీ మేయర్ గా టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి సోమవారం (మే 19) ఎన్నిక జరగాల్సి ఉంది. కూటమి ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ మేయర్ ఎన్నికలకు పలువురు తెలుగుదేశం కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
జీవీఎంసీలో కూటమికి దాదాపుగా 74 మందికి కార్పొరేటర్ల బలం ఉంది. 56 మంది హాజరైతే డిప్యూటీ మేయర్ సజావుగా సాగి ఉండేది. కానీ కేవలం 54 మంది మాత్రమే హాజరుకావడంతో కోరం లేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అదికారి ప్రకటించారు. ఈ సమాచారం అందుకున్న ఇలా డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందో, లేదో… ఆ సమాచారం నారా లోకేశ్ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై అసంతృప్తితోనే పలువురు గైర్హాజరయ్యారని తెలుసుకున్న ఆయన గైర్హాజరైన వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పొత్తులో మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేననీ, భవిష్యత్ లో మళ్లీ ఇటువంటి సంఘటన పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని లోకేష్ పల్లాకు క్లాస్ పీకారట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-serious-on-palla-srinivasarao-39-198390.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.