బాబు విజనరీ.. జగన్ ప్రిజనరీ!

Publish Date:May 29, 2023

Advertisement

లోకేష్ చేపట్టిన యువగతం పాదయాత్ర ఆయనను నిజమైన ప్రజా నేతగా మార్చేసిందా? గత 110 రోజులుగా ఆయన పాదయాత్రలో భాగంగా నిరంతరం జనంతో మమేకం అవ్వడంతో వారికి కావలసిందేమిటి? వారికి చేయవలసిందేమిటి అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చిందా? అంటే మహానాడులో లోకేష్ ప్రసంగం విన్న వారంతా ఔననే అంటున్నారు. పాదయాత్ర పొడుగునా ఆయనకు జగన్  పార్టీ విధానాల వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు ఎదురైన కష్టాలు కళ్లకు కట్టాయి. జనం సమస్యలు ప్రత్యక్షంగా తెలిశాయి.

అంతే కాదు.. జనంలో తిరుగుతూనే వాటికి పరిష్కారాలను కనుగొనేయత్నం చేశారు. ఈ  మొత్తం ప్రక్రియలో ఆయన తెలుగుదేశం జాతీయ కార్యదర్శిగా కంటే జనం మనిషిగా మరింత ఎక్కవ రాటు దేలారు. ప్రజా సమూహాలలో మమేకమైన అనుభవమే ఆయన మంచి వక్తగా మార్చింది. తెలుగుదేశం మహానాడులో ఆయన చేసిన ప్రసంగంలో అదే ప్రతిఫలించింది. అందుకే ఆయన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, నాలుగేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిగ్గా చెప్పగలిగారు. మహానాడులో అధినేత ప్రసంగంతో సమానంగా లోకేష్ ప్రసంగానికి  స్పందన లభించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంతో పోలిస్తే.. ఆ యుద్ధంలో తిరుగులేని విజయం తెలుగుదేశం పార్టీదే అన్న ధీమాను లోకేష్ ఇవ్వగలిగారు. జగన్ ను పిల్ల సైకోగా అభివర్ణించిన ఆయన అంత కంటే పెద్ద సైకోలను ఎదుర్కొన్న అనుభవం తెలుగుదేశం పార్టీది అని విస్పష్టంగా ప్రకటించి ఒక్క చాన్స్ విజ్ణప్తితో అధికార పగ్గాలు అందుకున్న జగన్ ఆ చాన్స్ ను తాను ధనిక సీఎంగా ఆవిర్భవించేందుకు ఉపయోగించుకుని ప్రజలను పేదలగానూ, పేదలను నిరుపేదలుగానూ మార్చేశారన్నారు.

రైతులకు ఇచ్చే పాసుపుస్తకాలపై కాదు జగన్ చెత్త పన్ను బిల్లులపై తన ఫొటో ముద్రించుకోవాలని సూచించారు. బాబా పాలనలో నిర్మాణాలు జరిగితే.. జగన్ పాలన విధ్వంసాల మయంగా అభివర్ణించిన లోకేష్.. మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.   మహానాడుకు వచ్చిన పసుపు సైన్యానికి, పార్టీ పెద్దలకు సలాం అంటూ ప్రారంభమైన లోకేష్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకొంది.   తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం.. పసుపు జెండా చూస్తే పూనకం అంటూ క్యాడర్ లో జోష్ నింపారు. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడక్షరాల శక్తి ఎన్టీఆర్.. జనానికి కష్టం వస్తే కన్నీరు తుడిచింది. ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చింది. నిజమైన సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందీ ఆ శక్తేనని లోకేష్ చెప్పారు.  

పార్టీ పెట్టాలంటే హిస్టరీ ఉండాలి.. దానిని నడపాలంటే క్యాలిబర్ ఉండాలి ఆ రెండూ తెలుగుదేశానికి నిండుగా ఉన్నాయన్నారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కు హిస్టరీ ఉంది.. ఆ పార్టీని నడుపుతున్న చంద్రబాబుకు క్యాలిబర్ ఉంది.. ఆ రెండూ లేని పార్టీ వైసీపీ అని ఎత్తి చూపారు. చంద్రబాబు పేరు అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్  అన్న లోకేష్  జగన్ అవినీతి చిరునామా ఎద్దేవా చేశారు.  లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు రూ.లక్ష చెప్పులు వేసుకునేవాడు రూ.వెయ్యి వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని లోకేశ్ ప్రశ్నించారు. బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి ఇడుపులపాయ వైజాగ్లలో ప్యాలెసులు ఉన్నవాడు పేదవాడా? అని నిలదీశారు. 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.