Publish Date:Oct 28, 2024
ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అయినా అనుక్షణం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అలర్ట్ గా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మారుమూల ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా స్పందిస్తున్నారు. ఆ కష్టాన్ని, నష్టాన్ని తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకు ఉదాహరణ చెప్పాలంటే... ఇటీవల ఆర్టీసీ బస్ డ్రైవర్ ఒకతను దేవర సినిమాలోని దావుడి పాటకు డ్యాన్స్ చేశారు. అదేంటి డ్యాన్స్ చేయడానికీ లోకేష్ ప్రతి ఒక్కరి కష్టంలోనూ నేనున్నానంటూ ముందుకు వస్తున్నారనడానికి సంబంధం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
ఆ డ్రైవర్ ఏదో తన ఇంట్లోనో లేకపోతే డ్యూటీ దిగిపోయిన తరువాతో ఈ డ్యాన్స్ చేయలేదు. బస్సును మార్గ మధ్యంలో నిలిపేసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఆయన చేసిన ఆ డ్యాన్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆయన ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించారని గానీ, బస్సు మధ్యలో ఆపేయడం వల్ల తమకు సమయం వృధా అయ్యిందని కానీ ఎటువంటి కంప్లయింట్లూ రాలేదు. అయినా విధి నిర్వహణలో నిర్లక్యంగా వ్యవహరించాడంటూ ఆ కండక్టర్ ను ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అయితే డ్రైవర్ ను ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేయడానికి ముందే లోకేష్ ‘సూపర్ డ్యాన్స్ బ్రదర్.. కీపిటప్, బస్సులో ప్రయాణీస్తున్న వారు కూడా ఎలాంటి ఫిర్యాదులూ చేయకుండా నీ డ్యాన్స్ ను నాలాగే యంజాయ్ చేసి ఉంటారు ’ అంటూ ట్వీట్ చేశారు.
ఇప్పుడు విషయానికి వస్తే.. ఆ డ్రైవర్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని ట్వీట్ చేస్తూ ఓ నెటిజన్ లోకేష్ కు ట్యాగ్ చేస్తూ.. విధుల్లో క్రమశిక్షణ, సమయ పాలనా అత్యంత ముఖ్యమైనవే అయినా.. ఎవరికీ నష్టం కలిగించని ఈ చిన్న పాటి వినోదం అందించిన ఆ కండక్టర్ ను సస్పెండ్ చేయడం అన్యాయం అని పేర్కొని, అతడి సస్పెన్ష్ ఎత్తివేసేలా చూడాలి అని కోరారు. లోకేష్ వెంటనే స్పందించారు. ఆ నెటిజన్ కు వెంటనే బదులిస్తూ ఆ కండక్టర్ సస్పెన్షన్ వెనక్కు తీసుకుంటారు. ఆయన వెంటనే విధుల్లో చేరుతారు అని పేర్కొన్నారు. అంతే కాదు తాను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత కలుస్తానని ఆ నెటిజన్ కు రిప్లై ఇచ్చారు. లోకేష్ ఇమ్మీడియెట్ రెస్పాన్స్ పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-saves-driver-from-suspenssion-25-187540.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.