దావోస్ వేదికగా చంద్రబాబులోని మరో కోణాన్ని బయటపెట్టిన లోకేష్

Publish Date:Jan 21, 2025

Advertisement

చంద్రబాబు అంటే అపర చాణక్యుడు, సంక్షోభంలో అవకాశాలు వెతుక్కుని ముందుకు సాగే వ్యూహకర్త, అపార అనుభవం ఉన్న రాజకీయవేత్త.. దార్శనికుడు అనే అందరికీ తెలుసు అయితే దావోస్ వేదికగా ఆయనలోని మరో కోణాన్ని ఆయన తనయుడు నారా లోకేష్ బయటపెట్టారు. తన తండ్రి చంద్రబాబు అంటే ఒక రాజకీయవేత్తగానే అందరికీ తెలుసు కానీ ఆయనలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడని చెప్పారు. అయితే  ఆ వ్యాపారవేత్త దారుణమైన నష్టాలను చవి చూశారని వెల్లడించారు. హెరిటేజ్ కు ముందు సీబీఎన్ అనుక వ్యాపారాలు చేశారనీ, వాటిలో దారుణంగా నష్టపోయారనీ చెప్పారు. అయితే నష్టాలకు వెరవకుండా ఆయన ముందుకే సాగారన్న లోకేష్ చివరకు హెరిటేజ్ ను స్థాపించారని వివరించారు. ఇప్పుడు హెరిటేజ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. 

అదే విధంగా ఆయన రాజకీయాలలోనూ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అనేక ప్రయోగాలు చేశారనీ, భవిష్యత్ ను ముందుగానే దర్శించిన దార్శనికుడని చెప్పిన లోకేష్.. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే అందుకు అప్పట్లో ఆయన విద్యావిధానంలో తీసుకువచ్చిన మార్పులే కారణమన్నారు. దావోస్ లో సోమవారం (జనవరి 20) నుంచి ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం వెళ్లిన నారా లోకేష్ జ్యూరిల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తల సదస్సులో ప్రసంగించారు. ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచీ దాదాపు 180 మంది తెలుగు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. వీరిలో మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు.

వీరిని ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో ఆయన ఇక్కడ ఇంత మంది తెలుగు వారిని చూస్తుంటే ఆనందంగా ఉంది.. అసలు జ్యూరిచ్ లో ఉన్నానా.. జువ్వలపాలెంలో ఉన్నానా అన్న ఆశ్చర్యం కలుగుతోందని చమత్కరించారు.  
ఇక వైసీపీ హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టిన ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు గాడిలో పెడుతున్నారనీ, ప్రస్తుతం రాష్ట్రం కష్టాల నుంచి గట్టెక్కి అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందనీ చెప్పిన నారా లోకేష్.. ఇప్పుడు రాష్ట్రానికి మీరంతా సహకారం అందిచాలన్నారు. పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోందనీ, మీరంతా స్పందించి ముందుకు రావాలని కోరారు.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.