చిన్నబాబు నాడు చెప్పారు.. నేడు జరిగింది!

Publish Date:Aug 31, 2025

Advertisement

మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. పని మొదలు పెడితే పూర్తి చేయాలి. ఈ విషయంలో రెండో ఆలోచనకే తావుండకూడదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పే విశ్వసనీయత అంటే అదీ. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూ జనం విశ్వాసం పొందేలా చెప్పింది చేసి చూపించిన పాపాన పోలేదు. నవరత్నాలంటూ ఆర్భాటంగా ప్రకటించిన పథకాల అమలు కూడా అరకొరగానే సాగింది. బటన్ నొక్కి సంక్షేమ సొమ్ము లబ్ధిదారులకు పందేరం చేశామంటూ ఘనంగా చాటుకున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఫలితమే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి చరిత్రలో మిగిలిపోయేటంతటి ఘోర పరాజయం ఎదురైంది. 

అయితే మాట ఇస్తే నిలబెట్టుకుంటాం. అంటూ తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఉద్ఘాటించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. అదే చేస్తున్నారు. పాదయాత్ర సందర్బంగా రాయలసీమ జిల్లాలకు హంద్రీ నీవాతో నీళ్ళు అందిస్తామని నారా లోకేష్‌ చెప్పారు. చెప్పడమే కాదు..  శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గుట్టూరు గ్రామంలో ఈ హామీని ఓ శిలాఫలకంపై చెక్కి మరీ ఆవిష్కరించారు.  

గోరంట్ల, మడకశిర పరిధిలోని గ్రామాలకు తాగఃగునీరు, సాగునీరు అందించి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా ఆ శిలాఫలకంపై చెక్కించారు. ఇప్పుడు అది సాకారమైంది. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు శనివారం (ఆగస్టు 30)  కుప్పంలో కృష్ణమ్మకి గంగపూజ చేశారు. ఈ సందర్భంగా జనం నాడు లోకేష్ ఆవిష్కరించిన శిలా ఫలకం చూపి మరీ ఆయన తన మాట నిలబెట్టుకున్నారనీ, సాగు, తాగు నీరందించారని ఘనంగా చెప్పుకుంటున్నారు. పండుగ చేసుకుం టున్నారు.  

ఒక పక్క వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపణలూ, విమర్శలూ గుప్పిస్తుంటే.. మరో పక్క నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది.  ఇప్పుడు కృష్ణా జలాలను సీమకు అందించి కుప్పంలో గంగపూజ చేసి విశ్వసనీయత అంటే ఏమిటో చంద్రబాబు, లోకేష్ ను చాటారు. దీంతో వైసీపీ గళం మూతపడింది. కుప్పంకు కృష్ణాజలాలకు సంబంధించి వైసీపీ ఒక్కటంటే ఒక్క ముక్క మాట్లాడటం లేదు.   మంచిని చూడటానికి వారి నేత్రాలు, పొగడడానికి వారి నోళ్లు సహకరిస్తున్నట్లు లేదంటూ  వైసీపీ నేతలను నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.