క‌డ‌ప నేత‌ల‌పై లోకేష్ క‌న్నెర్ర‌.. కారణాలేంటి?

Publish Date:Apr 8, 2026

Advertisement

నారా లోకేష్ ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జ్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌రీ ముఖ్యంగా క‌డ‌ప జిల్లా ఎమ్మెల్యేలు, నేత‌ల‌పై లోకేష్ సీరియస్  అయ్యారు. వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు   గైర్హాజరు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.  మ‌రీ ముఖ్యంగా కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.

మైద‌కూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనీ, నియోజకవర్గ సమస్యలపై పట్టు కోల్పోతున్నారని లోకేష్ ద‌గ్గ‌ర స‌మాచారం ఉండ‌టంతో ఆయ‌న‌పై సీరియ‌స్ అయ్యారు. ఇటీవ‌ల పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ త‌న‌యుడు మ‌హేష్ యాద‌వ్ డ్ర‌గ్ టెస్టుల్లో ప‌ట్టుబ‌డ‌టం.. పార్టీకి మాయ‌ని మ‌చ్చ‌గా మార‌డం కూడా ఇందుకు ఒక కార‌ణం అయి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు.

ఇక ప్రొద్ద‌టూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని  నారా లోకేష్ అన్నారు.అలాగే కడప  ఎమ్మెల్యే   మాధ‌వీ రెడ్డి   జిల్లా హెడ్ క్వార్ట‌ర్లో ఉంటూ కూడా జ‌నానికి  అందుబాటులో ఉండ‌టం లేద‌న్న ఫిర్యాదులున్నాయి.

ఇటీవ‌ల ఒక ఆక‌స్మిక త‌నిఖీ చేసినా అది బూమ‌రాంగ్ కావ‌డంతో.. పార్టీ అధిష్టానం ఆమెపై ఆగ్ర‌హంగా  ఉన్న‌ట్టు స‌మాచారం. మాధ‌విరెడ్డిపై వ‌స్తున్న ఫిర్యాదుల‌పై లోకేష్ వివ‌ర‌ణ అడిగారని తెలుస్తున్నది. ధ‌ర్మ‌వ‌రం ఇంఛార్జ్ ప‌రిటాల శ్రీరామ్ త‌దిత‌ర నేత‌ల‌పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి నారా లోకేష్. కొందరు నేతలు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులపై తీవ్ర‌ ఒత్తిడి తెస్తున్నారని, ఇందువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని లోకేష్ మందలించిన‌ట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సొంత వర్గాలను ప్రోత్సహించడంపైనా లోకేష్ సీరియస్ అయిన‌ట్టు స‌మాచారం. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని  పార్టీ అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య గ‌ల‌ ఆధిపత్య పోరుపై లోకేష్ గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు.

ఎమ్మెల్యేలు లేదా ఇన్-ఛార్జ్‌లు ప్రజలకు అందుబాటులో లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని  లోకేష్ నిష్కర్షగా చెప్పినట్లు తెలుస్తోంది.  ప్రతి మూడు నెలలకోసారి ఇచ్చే పర్ఫార్మెన్స్ రిపోర్ట్  ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందన్న వార్నింగ్ కూడా లోకేష్ నుంచి వారికి వెళ్లిందని చెబుతున్నారు.  ఇసుక, భూ దందాల వంటి వాటిలో ఎవరి పేరు వినిపించినా ఉపేక్షించేది లేదన్నారని చెబుతున్నారు. మొత్తానికి, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచే క్రమంలో సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదన్న సంకేతాన్ని ఈ హెచ్చరికల ద్వారా లోకేష్ ఇచ్చారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.