బోండా ఉమ డిసైడైపోయారు.!

Publish Date:Jul 28, 2026

Advertisement

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారం  కలకలం రేపుతోంది.  ఇటీవల జరిగిన  ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీనాయకులతో కలిసి వేదిక పంచుకోవడం, అక్కడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బోండా ఉమా నుంచి వివరణ కోరింది. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు కృష్ణాంజనేయులు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బోండా వైఖరిని చూస్తుంటే ఆయన తెలుగుదేశం కు గుడ్ బై చెప్పడానికి డిసైడైనట్లే కనిపిస్తోందన్నారు. 

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న బోండా ఉమా, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే కాకుండా,  విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఎమ్మెల్యే హోదాలో అక్కడ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న నాయకులతో కలిసి బోండా ఉమా ఒకే వేదికపైకి రావడం రాజకీయ చర్చకు తావిచ్చింది. బోండా తీరుపై తెలుగుదేశం అధినేత సీరియస్ అయ్యారు.  

పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణాంజనేయులు.. బోండా వ్యవహారం కేవలం ముద్రగడ సంస్మరణ లో వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడానికి మించి రాజకీయ వ్యూహం ఉందని అన్నారు.  

కూటమి ప్రభుత్వంలో మొదటి విడత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బోండా ఉమ ఆ అసంతృప్తిని ఇలా వ్యక్తం చేయడమే కాకుండా.. పార్టీని వీడతానని సంకేతాలు ఇవ్వడం ద్వారా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావడానికి చూస్తున్నారనీ, అయితే గతంలో ఇటువంటి ఒత్తిడులకు చంద్రబాబు లొంగి ఉండొచ్చు కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని కృష్ణాంజనేయులు అన్నారు. అందుకే ఒక వేళ ఒత్తిడికి చంద్రబాబు లొంగకుంటే..   తన భవిష్యత్ రాజకీయ అడుగుల ఎటు వేయాలన్న   నిర్ణయానికి బోండా ఉమ ఇప్పటికే  వచ్చేసి ఉంటారని కృష్ణాంజనేయులు అన్నారు. 

కూటమి రాజకీయంలో సామాజిక వర్గాల సమతుల్యత కూడా ఈ వివాదానికి ఒక కారణమని పేర్కొన్నారు.  జనసేన పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో టీడీపీ పరిమితులు ఎదుర్కొంటోందనీ,  దీనిని ఆసరాగా చేసుకుని విపక్షాలు టీడీపీలోని అసంతృప్త కాపు నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో వైసీపీ వలకు బోండా ఉమ చిక్కారని కృష్ణాంజనేయులు విశ్లేషించారు.  

 

Bonda Uma, Telugu Desam Party, Vijayawada Politics, Ambati Rambabu, Andhra Pradesh News
 

By
en-us Political News

  
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.