మంగళగిరిలో లోకేష్ కు ఎదురేలేదు!.. వైసీపీకి అభ్యర్థులే దొరకడం లేదు!

Publish Date:Mar 5, 2024

Advertisement

మంగళగిరి నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపైనే ఉంది. నిన్నటి వరకూ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి ఏమిటి? అన్నది పక్కన పెడితే మాత్రం ఇప్పుడు మాత్రం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం లోకేష్ కు కంచుకోట అన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచీ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకుని  తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1985 తరువాత మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలిచిన చరిత్రే లేదు. అటువంటి సేఫ్ నియోజకవర్గం కాని మంగళగిరి నుంచి లోకేష్ తొలి సారిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికలలో లోకేష్ పరాజయం పాలైనా.. ఎటువంటి పరిస్థితులనైనా, పోటీనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న విషయాన్ని చాటారు. పరాజయం పాలైనా నియోజకవర్గాన్ని వదలకుండా అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరు సాగించారు. మరో సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి రెడీ అయిపోయారు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయాల హిస్టరీ చూస్తే అటువంటి నియోజకవర్గం నుంచి ఒకసారి ఓటమి పాలై మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే ఎంతో సాహసం కావాలి. అంతకు మించి ధీమా ఉండాలి. ఆ రెండూ తనలో పుష్కలంగా ఉన్నాయని లోకేష్ చాటారు. 

 తగ్గేదేలే ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తానంటూ ముందుకు అడుగేశారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది లోకేష్ మొండితనమా.. ధీమానా అంటే ఖచ్చితంగా గెలుపు ధీమానే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మంగళగిరిలో లోకేష్ విజయం సాధించడం గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు. గత ఐదేళ్లుగా నారా లోకేష్ ఇక్కడ  పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈసారి మంగళగిరిలో విన్నింగ్ గ్యారంటీ అని వినిపిస్తుంది.

లోకేష్ గెలుపు అవకాశాలను చూస్తే.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. 2014లో జస్ట్ 12 ఓట్ల తేడాతో బయటపడిన ఆర్కే 2019లో నారా లోకేష్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.  అటువంటి ఆర్కే మంగళగిరిలో విజయం సాధించడం అసాధ్యమన్న అంచనాకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఆయనను మార్చేసి   లోకేష్ మీద బీసీ నేత గంజి చిరంజీవిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనితో అలిగిన ఆర్కే వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరి.. మళ్లీ ఓ పది రోజుల్లోనే తిరిగి వెనక్కు వచ్చేశారు. అదంతా వేరే కథ. లోకేష్ ఓటమే లక్ష్యంగా జగన్ మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ గంజికి కూడా ఇక్కడ విజయం సాధించేంత సీన్ లేదని భావించి మరో అభ్యర్థిని రంగంలోకి దింపారు.    చివరకు ఆమెను కూడా మారుస్తారేమో తెలియదు. అధికారంలో ఉండి కూడా లోకేష్ కు దీటైన అభ్యర్థిని ఎంపిక చేయడం విషయంలో జగన్ మల్లగుల్లాలు పడుతున్నారంటేనే మంగళగిరిలో లోకేష్ సాధించిన పట్టు ఏమిటన్నది అవగతమౌతోంది. అలాంటి పట్టు సాధించడం కోసం లోకేష్ కూడా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి  నాయకుడిని వ్యక్తిగతంగా కలిసి దగ్గరయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచే కాదు, సామాన్య జనం నుంచీ, పరిశీలకుల నుంచీ కూడా వ్యక్తమౌతోంది.  

పరిశీలకులైతే మంగళగిరిలో వైసీపీ అడ్రస్ గల్లంతేనని విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా వైసీపీ మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అభ్యర్థులను మార్చడమే అంటున్నారు. ఎంతగా ప్రయత్నిస్తున్నా నియోజకవర్గ వైసీనీరెండు నెలల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చినప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి నుంచి వలసలు ఆగడం లేదు. మంగళగిరిని నెం.1 చేయడమే లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గంలో భారీ స్పందన లభిస్తోంది. వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు కూడా పెద్దఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు.  చేరుతున్నారు. జగన్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన  వైసిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం బాట పడుతున్నారు. తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన 150 వైసిపి కుటుంబాలు యువనేత లోకేష్ సమక్షంలో తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు.  

తాడేపల్లి పట్టణానికి చెందిన నాయకులు ఎస్.రామశంకర్, బి.రవికుమార్ తో సహా 20 మంది, ఉండవల్లి గ్రామానికి చెందిన శింగంశెట్టి తేజోధర్, ఉప్పు సుబ్బారావు(నాని)తో సహా 20 మంది, దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం నుంచి అనంత్ నెమలికంటితో సహా నలుగురు నాయకులు, శ్రీకృష్ణ లెనిన్, గుమ్మడి గోపి, వలపర్ల రామారావు, కనపర్తి హరి , మల్లవరపు మాణిక్యాల రావు, ఆరుమల్ల సుబ్బారావు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు   15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. అలాగే కుంచనపల్లి గ్రామం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు తెలుగుదేశం గూటికి చేరారు. ఇలా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి వైసీపీనీ వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్న వారి సంఖ్య జాతరను తలపించేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంగళగిరిలో పరిస్థితిని చూస్తే లోకేష్ అత్యధిక మెజారిటీ సాధించి విజయంలో చరిత్ర తిరగరాయడం ఖాయమని అంటున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.