ఏపీ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్.. రూ.1200 కోట్ల ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు విడుదల

Publish Date:Feb 11, 2026

Advertisement

ఆర్భాటం లేదు, హడావుడి లేదు.. ఫుల్ పేజీ ప్రకటనలు లేవు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేశారు. అది ప్రభుత్వ బాధ్యత, చేసి తీరాలి అన్నట్లుగా చాలా కామ్ గా జగన్ హయాం నుంచీ బకాయిపడిన మొత్తం రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం చెల్లించేసింది. విద్యాశాఖ మంత్రిగా ఈ ఘనత నిస్సందేహంగా నారా లోకేష్ ఖాతాలోనే పడుతుంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు 12వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందంటూ నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేశారు.  

గత జగన్ ప్రభుత్వ  విద్యా దీవెన పథకంలో  భాగంగా నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. ఆ నిధులను చాలా మంది ఇతర కుటుంబ అవసరాలకు వాడుకోవడంతో కాలేజీలకు ఫీజులు చెల్లింపులు జరగలేదు. ఫలితంగా విద్యాసంస్థల్లో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి, విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయే పరిస్థితిఏర్పడింది. గత ప్రభుత్వం దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల బకాయిల పెట్టింది.  జగన్ సర్కార్ తప్పుడు విధానాల వల్ల విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలూ కూడా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.   

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ సమస్యపైనే ప్రధానంగా దృష్టి సారించారు.  విద్యార్థుల ఫీజురీయింబర్స్ మెంట్ నిధులను  నేరుగా కాలేజీల ఖాతాల్లోకే జమ చేసేలా విధానాన్ని రూపొందించారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన  1,200 కోట్ల రూపాయలతో పాత బకాయిలతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను కూడా క్లియర్  అయ్యేలా చేశారు.  ఈ విషయాన్ని సామాజిక మాధ్యవ వేదికగా పేర్కొన్న నారా లోకేష్..  విద్య విషయంలో ఆందోళన వలదు.. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోండి, ప్రభుత్వం మీకు అండగా ఉందని భరోసా ఇచ్చారు. రీయింబర్స్ మెంట్  పాత బకాయిలన్నీ తీర్చి, ఇక నుంచి సకాలంలో నిధులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.  

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.