మండలిలో లోకేశ్ విశ్వ‌రూపం.. కొడాలి నాని, వంశీకి ఇక ద‌బిడిదిబిడే!

Publish Date:Nov 14, 2024

Advertisement

తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌కు వెన్నులో వ‌ణుకుపుడ‌తోంది. పోలీసులు ఎవ‌ర్ని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియ‌క చాలామంది ర‌హ‌స్య ప్రాంతాల‌కు వెళ్లి త‌ల‌దాచుకుంటున్నారు. వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్య‌ ప‌ద‌జాలంతో టీడీపీ, జ‌న‌సేన నేత‌లు, వారి కుటుంబాల్లోని ఆడ‌వారిపై పోస్టులు పెట్టారు. వారిలో అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ ప్ర‌ముఖుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు  పోలీసులు నోటీసులిచ్చారు. మ‌రోవైపు శ్రీ‌రెడ్డి, పోసాని కృష్ణ ముర‌ళిల‌పై ఏపీలోని ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోద‌య్యాయి.  వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్  వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి అరెస్టుతో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసానికి కొద్దిదూరంలో వైసీపీ సోష‌ల్ మీడియా కార్యాల‌యాన్ని ఏర్పాటుచేసి పార్టీ సోష‌ల్ మీడియా ఇంచార్జి స‌జ్జ‌ల‌ భార్గ‌వ్ సూచ‌న‌ల‌తో ఈ అస‌భ్య‌పోస్టుల తంతు న‌డిచేద‌ని తేలింది. వంద‌లాది మంది సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు నెల‌వారి జీతాలు అందించి టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌పై అస‌భ్య‌ పోస్టులు పెట్టించేవార‌ని తేలింది. మ‌రోవైపు వైఎస్ ష‌ర్మిళ‌, విజ‌య‌మ్మ‌, సునీత‌ల‌పై ఎంపీ అవినాశ్ రెడ్డి సూచ‌న‌ల‌తో ఆయన పీఏ ద్వారా వ‌చ్చిన కంటెంట్‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసేవాడిన‌ని పోలీసుల విచార‌ణ‌లో వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి పేర్కొన్న‌ట్లు తెలిసింది. 

వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డిపై కేసు న‌మోదు చేసి జైలుకు పంపించిన పోలీసులు.. ఎంపీ అవినాశ్ రెడ్డి, స‌జ్జ‌ల భార్గ‌వ్ ల‌పైనా కేసులు న‌మోదు చేశారు. వారు ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారం అంతా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలిసే జ‌రిగింద‌న్న వాద‌న ఉండ‌టంతో ఆ మేర‌కు పోలీసులు విచార‌ణ ముమ్మ‌రం చేశారు. మ‌రోవైపు అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ లు సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌కరంగా, వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి పోస్టులు, ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు చేస్తే ఎవ‌ర్నీ వ‌దిలి పెట్టేదిలేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, శాస‌న మండ‌లిలో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల‌పై వైసీపీ స‌భ్యులు అభ్య‌త‌రం తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నద‌ని, వైసీపీ నాయ‌కుల‌ను జైళ్ల‌కు పంపించేందుకు సోష‌ల్ మీడియాను అడ్డుపెట్టుకుంటుందంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో  జ‌గ‌న్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా పారిపోయారంటూ టీడీపీ స‌భ్యులు ఎద్దేవా చేశారు.  దీంతో బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు పారిపోలేదా? అంటూ నిలదీశారు. బొత్స వ్యాఖ్య‌ల‌పై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యాడు.

గత ప్రభుత్వంపై చంద్రబాబు రెండేళ్లు సభలో ఉండి పోరాడిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. నా తల్లిని అవమానించడంతోనే సభ నుంచి ఆయన చాలెంజ్ చేసి వెళ్లిపోయారన్నారు. ఈ సమయంలో జగన్ కుటుంబంపై కూడా అన్నారని కొంత మంది వైసీపీ సభ్యులు అన‌డంతో.. వారికి లోకేశ్‌ గట్టిగా రిప్లయ్ ఇచ్చాడు. తాము జగన్ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. త‌న త‌ల్లిని అసెంబ్లీ వేదిక‌గా అవ‌మానించార‌ని వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశాడు. వైఎస్ ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌పైనా అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టార‌ని, అలాంటి వారిని అరెస్టు చేయ‌కుంటే ఏం చేస్తార‌ని లోకేశ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోకేశ్‌ ఆవేశాన్ని చూసి వైసీపీ సభ్యులు చర్చను పొడిగించలేదు. నారా భువనేశ్వరిని కించపరిచిన వారిని తాము ప్రోత్సహించబోమని బొత్స చెప్పుకొచ్చారు. అయితే, ఎన్నిక‌ల్లో టికెట్ ఎలా ఇచ్చార‌ని, అలా చేస్తే వారిని ప్రోత్స‌హించిన‌ట్లే క‌దా అంటూ లోకేశ్ ప్ర‌శ్నించ‌డంతో.. వైసీపీ స‌భ్యులు నోరు మెద‌ప‌లేదు. మొత్తానికి నారా భువ‌నేశ్వ‌రిపై అస‌భ్య‌ వ్యాఖ్య‌లు చేసిన వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని మండ‌లి వేదిక‌గా లోకేశ్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. దీంతో భువ‌నేశ్వ‌రిపై వ్యాఖ్య‌లు చేసిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, వారి అనుచ‌రుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టులు ఉంటాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ప‌లు కేసుల్లో కొంద‌రు వైసీపీ నేత‌లను అరెస్టు చేసిన పోలీసులు.. కొడాలి నాని, వంశీల జోలికి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు వెళ్ల‌లేదు. పార్టీ కార్యాల‌యంపై దాడి కేసు విష‌యంలో వంశీపై మాత్ర‌మే కేసు న‌మోదైంది. అయితే, వారిద్ద‌రూ తెలుగుదేశంలోని కీల‌క నేత‌ల ద్వారా  చంద్ర‌బాబు, లోకేశ్ వ‌ద్ద‌కు రాయ‌బారాలు న‌డుపుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త‌మ‌ను క్ష‌మించాల‌ని, బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్ధ‌మ‌ని వారు తెలుగుదేశం ముఖ్య‌ నేత‌ల వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో శాస‌న మండ‌లిలో లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు కొడాలి నాని, వంశీ, వారి వ‌ర్గీయుల్లో భ‌యాందోళ‌ను రేకెత్తిస్తున్నాయి. లోకేశ్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారిద్ద‌రిని వ‌దిలిపెట్ట‌రని, వారు జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని తెలుగుదేశం వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే కొడాలి నాని, వంశీ అరెస్టు కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ముందుగా వారిద్ద‌రిని అరెస్టు చేయాల‌న్న డిమాండ్‌ను చంద్ర‌బాబు, లోకేశ్ వ‌ద్ద ప‌లువురు తెలుగుదేశంనేత‌లు ఇప్పటికే తీసుకువచ్చారు.  రెడ్‌బుక్ చాప్ట‌ర్‌-3 త్వ‌ర‌లో ఓపెన్ అవుతుంద‌ని, అందులో కొండాలి నాని, వంశీ పేర్లు ఉంటాయ‌ని స‌మాచారం.

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.