బాధ్యత వద్దు..విమర్శలే ముద్దు.. జగన్ పై లోకేష్ ఫైర్

Publish Date:Oct 29, 2025

Advertisement

మొంథా తుఫాను.. ప‌లు ప్ర‌భావిత జిల్లాల ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేసింది. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అన్న ఆందోళనలో క్షణమొక యుగంగా గడిపారు. కానీ వారిని మించి.. ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బందీ లేకుండా తుపాను గండం గడిచేలా చేయడానికి ముఖ్యమం్తరి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ రెండు రోజులూ కంటిమీద కునుకు సంగతి పక్కన పెడితే రెప్ప కూడా వాల్చకుండా అప్రమత్తంగా ఉన్నారు. నిరంతర సమీక్షలతో, ఆర్టీజీఎస్ నుంచి క్షణం క్షణం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తూ, వాతావరణ కేంద్రం నుంచి వచ్చే సంకేతాలను, సందేశాలను పరిశీలిస్తూ గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకధాటిగా 12 గంటల పాటు ఆర్టీజీఎస్ లోనే తిష్ఠవేసి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించారు. 

ఇలా అనుక్షణం ప్రజల క్షేమం కోసం, తుపాను నష్టాన్ని కనిష్ఠస్థాయికి తగ్గించడం కోసం తపనపడ్డారు. తుపాను తీరం దాటిన తరువాత నష్టం అత్యంత తక్కువగా ఉండటంతో ఆయన శ్రమ ఫలించింది. అయినా ఆయన క్షణం తీరిక చేసుకోలేదు. వెంటనే అంటు బుధవారం (అక్టోబర్ 29) తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వేకు బయలుదేరడానికి ముందు ప్రభావిత ప్రాంతాల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను స్పీడప్ చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సూచనలు చేశారు.   

అయితే.. ప్రజలు కష్టాలలో ఉన్న సమయంలో ఏ నాయకుడైనా సరే.. అధికారంలో ఉన్నా, లేకున్నా బయటకు వచ్చి ప్రజలకు సహాయ హస్తం అందించాలి. ఇది కనీస బాధ్యత. అలా బయటకు వచ్చేందుకు మనస్కరించకుండా నోరు మెదపకుండా.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు, బాధితులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ సైలంట్ గా ఉండాలి. కానీ వైసీపీ ఎకో సిస్టమే వేరు. ఆ పార్టీ తాను చేయదు.. మరొకరు చేస్తుంటే ఓర్వదు. మొంథా తుపానును ఎదుర్కోవడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా సర్వశక్తులూ ఒడ్డి ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటుంటే.. వైసీపీయులు మాత్రం సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఎత్తి చూపించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన సంక్షోభ సమయంలో కరుణ ఉన్న నాయకుడెవరైనా సరే ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వస్తారనీ, అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటూ.. తన మీడియా నెట్ వర్క్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.  అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తమది ప్రజల ప్రభుత్వమని పేర్కొన్న లోకేష్ మొంథా తుపాను కారణంగా ప్రజలు ఎటువంటి కష్టనష్టాలూ ఎదుర్కోకుండా సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. ఆ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు.  

ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్న జగన్.. మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కనీసం తాడేపల్లికి కూడా రాకుండా బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటూ అబద్ధాల ప్రచారానికి పాల్పడు తున్నారని విమర్శించారు.  కష్టసమయంలో ప్రజలకు అండగా నిలవడానికి బదులుగా  బెంగళూరులో రెస్ట్ తీసుకోవడాన్నే జగన్ ఎంచుకున్నారని లోకేష్ విమర్శించారు. 

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.