లోకేష్ క్రికెట్ దౌత్యం.. జగన్ కు అంత ఉలుకెందుకంటే?

Publish Date:Mar 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ను చూసేందుకు స్టేడియంకు వెడితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఇంట్లో కూర్చుని చూసే  మ్యాచ్ కి అంత ఖ‌ర్చు పెట్టి..  వెళ్లి చూడ్డం అవ‌స‌ర‌మా?  విమ‌ర్శ‌లు చేశారు  ఆ సందర్భంగానే మంత్రి లోకేష్..  ఫైన‌ల్స్ కి కూడా ఇలాగే వెళ్తా.. వస్తానంటే మిమ్మల్నీ తీసుకెడతా జగన్ అంటూ రిటార్డ్ ఇచ్చారు.  అది పక్కన పెడితే..  క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వెళ్లిన సందర్భంగా నారా లోకేష్ అక్కడ మ్యాచ్ చూడడానికి వచ్చిన కేంద్ర మంత్రులు,  ఇత‌ర  రాజ‌కీయ ప్ర‌ముఖు, బిజినెస్ దిగ్గజాలతో కూడా భేటీ అవుతున్నారు. వారితో పలు అంశాలపై చర్చిస్తున్నారు.

ఇప్పటికే ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో లోకేష్ కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆయన చొరవ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మొత్తంగా నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ల వీక్షణకు స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు.. రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేందుకు గల అవకాశాలను కూడా జల్లెడపడుతున్నారు.  ఇదే జగన్ దుగ్ధకు కారణమని పరిశీలకులు అంటున్నారు. 

ఏది ఏమైనా ఇర‌వై  నాలుగు గంట‌లూ గిరి గీసుకుని ఒకే చ‌ట్రంలో ఇరుక్కు పోకుండా.. బావిలో క‌ప్ప‌లా మిగిలిపోకుండా అప్పుడ‌ప్పుడూ ఇలాంటి ఈవెంట్స్ కి హాజ‌రు కావ‌డం ఇటు మాన‌సికోల్లాసం. అటు రాజ‌కీయ  ప్ర‌యోజ‌నం రెండు క‌ల‌సి  వ‌స్తాయ‌నీ, లోకేష్ అదే చేస్తున్నారనీ అంటున్నారు విశ్లేషకులు.  

క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చే పారిశ్రామిక వేత్తలతో సంభాషించే అవకాశాలను ఆ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఒడిసిపడుతున్నారంటున్నారు. తద్వారా  త‌ద్వారా రాష్ట్రానికి పెట్టుబ‌డులు సాధించే ఛాన్స్ ఏర్పడుతోందంటున్నారు.  ఇప్పటికే అమరావతిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించి ఉన్నారు.  అందులో భాగంగా ఏమేం చేయాలో తెలియాలంటే ఇలాంటి  మ్యాచ్ ల‌కు హాజ‌రు కావాలి. ఆ స‌మ‌యంలో ఎదుర‌య్యే ప‌లువురు క్రీడాకారుల‌తో క‌ల‌సి ముచ్చ‌టించ‌వ‌చ్చు. ఐడియాలు షేర్ చేసుకోవ‌చ్చు. తాజాగా ఆదివారం (మార్చి 8) అహ్మ‌దాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన టి20 వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు నారా లోకేష్.. ప్ర‌పంచ స్థాయి క్రికెట్ స్టేడియం ఎలా నిర్మించారో ఒక ప‌రిశీల‌న చేశారు.

అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. అలాగే క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ తదితరులతో సంభాషించారు. ఇవన్నీ కచ్చితంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఎంతగానో దోహదం చేస్తాయని అంటున్నారు. అందుకే జగన్ వంటి నాయకుల విమర్శలను పట్టించుకోకుండా.. న్యూజెన్ లీడర్ గా లోకేష్ ముందుకు సాగుతున్నారు. అలా సాగడం ద్వారా జగన్ ది  అవుట్ డేటెడ్ క్రిటిసిజమ్ అన్న సంకేతాలు ఇస్తున్నారు.  

భార‌త్ లో క్రికెట్ అంటే ఒక మతం, ఒక ఎమోష‌న్.  కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకువచ్చే ఒక ఈవెంట్. అలాంటిది.. టి20 వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్ లో ఫైనల్ ఆడుతున్న టీమ్ ఇండియాను ఎంకరేజ్ చేయడానికి ప్రత్యక్షంగా మ్యాచ్ చూడడానికీ స్టేడియంకు వెళ్లడం ద్వారా లోకేష్ తనను తాను కోట్లాది మందితో కనెక్ట్ చేసుకుంటున్నారనడంలో సందేహం లేదు.  ఇక రాష్ట్ర ఐటీ మంత్రిగా అంత‌ర్జాతీయ ప్ర‌తినిథులు ఉన్న చోట ఉనికి చాటుకోవ‌డం కూడా ఏపీ బ్రాండ్ వాల్యూ లోకేష్ పెంచుతున్నారని భావించాల్సి ఉంటుంది.   ఇదే జగన్ ను కలవరపెడుతున్నది. లోకేష్ క్రికెట్ దౌత్యం రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుండటం.. తనకు రాజకీయంగా నష్టం చేస్తుందన్న భయంతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.