ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నారా లోకేష్

Publish Date:Oct 30, 2024

Advertisement

ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది.   అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించిన నారా లోకేశ్...   ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో పాల్గొన్నారు. లాస్ వెగాస్ లో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్నలోకేష్ పలువురు పారిశ్రామిక వేత్తలతో  వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.   అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ  రేచల్, పెప్సికో మాజీ సిఇఓ ఇంద్రానూయి, రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాలతో లోకేశ్ ఈ సదస్సులో భాగంగా భేటీ అయ్యారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన సాగుతున్నది. మొత్తంగా ఈ సమ్మిట్ లో లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలపై నారా లోకేశ్ పారిశ్రామిక వేత్తలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా, ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో విశిష్ట అతిథిగా నారా లోకేశ్ కీలకోపన్యాసం చేయనున్నారు. కాగా  ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్  లో భాగంగా పెప్సికో మాజీ చైర్మన్ అండ్ సీఈవో  ఇంద్రానూయితో భేటీ అయిన నారా లోకేస్  దార్శనికుడు నారా  చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తూ  అభివృద్ధి దిశగా  ముందుకు సాగుతోందని చెప్పారు. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కావాల్సిందిగా ఇంద్రానూయీని కోరారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న  ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.  

అలాగే మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వివరించిన లోకేష్  వివిధ రంగాలలో మహిళలకు సాధికారత కల్పించడంపై మీ ఆలోచనలను మాతో పంచుకోండని ఇద్రానూయిని అడిగారు.  విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోం దని వివరించారు.    ఎపిలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామన్న లోకేష్ ఇంద్రానూయిని ఆంధ్రప్రదేశ్ సందర్శనకు రావాల్సిందిగా ఆహ్వానించారు.  లోకేష్ ప్రతిపాదనలు, ఆహ్వానంపై  ఇంద్రానూయి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. 

అంతకు ముందు ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణలో లోకేష్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్ తోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి, రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరారు. అందుకు రేచల్ స్కాఫ్ సానుకూలంగా స్పందించారు.  క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పై  అమెజాన్ దృష్టి సారిస్తోందదని వివరించారు. ఏపిలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్నిసీరియస్ గాపరిశీలిస్తామని తెలిపారు. 

అనంతరం  రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్‌ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. లోకేష్ ప్రతిపాదనల పట్ల అశ్వినీ భరత్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. 

By
en-us Political News

  
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.