బెస్ట్ లీడర్ నారా లోకేష్.. తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వే
Publish Date:Jul 27, 2023

Advertisement
ఏపీలో ఇప్పుడున్న ప్రథమ శ్రేణి రాజకీయ నేతలలో చంద్రబాబు అందరికంటే సీనియర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన స్టేచర్, అనుభవం, దార్శనికతతో సాటి రాగల నేత ఏపీలో ఆయన వినా మరొకరు ఇప్పుడు లేరని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.. ఇక, ఆయన తరువాత ఇప్పుడున్న నేతలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంచు మించు సమకాలికులుగా చెప్పుకోవచ్చు. అందుకేఈ నేతలలో బెస్ట్ ఎవరన్నఅంశంపై తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సినీ హీరోగా భారీ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను కాదని నెటిజన్లు నారా లోకేష్ కు ఓటేశారు. తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వేలో నారా లోకేష్ ప్రజా నేతగా అత్యధిక ఓట్లను దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెస్ట్ లీడర్ గా అత్యధికులు నారా లోకేష్ కు ఓటేశారు. ఈ సర్వేలో నారా లోకేష్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అప్షన్లుగా ఇవ్వగా అత్యధిక శాతం మంది నారా లోకేష్ కు ఓటేశారు. బెస్ట్ లీడర్ గా నారా లోకేష్ కు 62 శాతం మంది ఓటేయగా.. 24 శాతం మంది పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ గా ఎన్నుకున్నారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ లీడర్ అంటూ కేవలం 14 శాతం మంది మాత్రమే ఓటేశారు. తెలుగు వన్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో స్వల్ప వ్యవధిలో 53 వేల మంది నెటిజన్లు పాల్గొన్నారు. దీంతో నెటిజన్లలో నారా లోకేష్ పట్ల నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా డిజిటల్ మీడియాను ఫాలో అవుతారన్న సంగతి తెలిసిందే. అలాంటి వర్గంలో నారా లోకేష్ కరిష్మా ఏంటో ఈ సర్వే ద్వారా బయటపడుతుంది.
ఈ సర్వేలో నారా లోకేష్ పట్ల నెటిజన్లు చూపిన నమ్మకం వెనక ప్రస్తుతం ఆయన సాగిస్తున్న యువగళం పాదయాత్ర కూడా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ స్టామినా ఏంటో ఆంధ్ర ప్రజానీకానికి అర్థమైంది. అనితర సాధ్యం అనదగ్గ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించిన లోకేష్.. జగన్ సర్కార్ గుక్కతిప్పుకోలేని విధంగా విమర్శల బాణాలను సంధిస్తూ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్రకు ముందు లోకేష్ వేరు.. ఇప్పుడు లోకేష్ వేరు అనేలా ఆయన పొలిటికల్ గా మేకోవర్ అయ్యారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలకు గుర్తు చేస్తూ.. ఇప్పుడు జగన్ సర్కార్ వైఫల్యాలను, అనుసరిస్తున్న కక్ష పూరిత వైఖరిని ప్రజలకు వివరిస్తూ లోకేష్ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ సర్వే రూపంలో బయటపడిందని చెప్పవచ్చు.
అయితే, నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగడం వెనక కఠోర శ్రమ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. రాజకీయంగా లోకేష్ తొలి అడుగు వేయకుండానే ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. బాడీషేమింగ్, ఆయన నడక, మాట ఇలా కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రత్యర్ధులు శృతి మించి ఆయన్ను తూలనాడారు. దానికి ఉల్లిక్కి పడని లోకేష్ ఇప్పుడు ఇలా పని తీరుతోనే సమాధానం చెప్పారు. ముందుగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టిన లోకేష్.. గర్జించే సింహంలా ఇప్పుడు ఇలా లక్షల మంది ప్రజా సైనికుల ముందు బెరుకు లేకుండా ప్రత్యర్థులను సూటిగా చీల్చి చెండాడుతున్నారు. మొత్తంగా ఇదీ మీ లోకేష్ అంటూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. దాని ఫలితమే ఈ ఆన్ లైన్ సర్వేలో నెటిజన్లు జయహో లోకేష్ అని మద్దతు తెలిపారని చెప్పడానికి సందేహం అవసరం లేదు.
http://www.teluguone.com/news/content/lokesh-best-leader-in-ap-25-159115.html












