వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం.. ఫలితం అప్పుడే తెలిసిపోయందా?!
Publish Date:May 15, 2024
Advertisement
ఏపీలో వైసీపీకి ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫలితాలు వెలువడకుండానే ఓటమి ఖాయమైందని వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఒటేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక, కక్షపూరిత పాలనను కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీశారు. రాక్షస పాలనకు చరమగీతం పాడుతున్నామన్న ఉత్సాహంతో వెల్లువలా ఓటింగ్ కు తరలివచ్చారు. ఓటింగ్ సరళిని చూసి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా అనే స్థాయిలో ఓటర్లు తమ ప్రతాపాన్నిచూపారు. వైసీపీ మూకలు ఘర్షణలు సృష్టించినా, దాడులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో 81.86శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ కు ముందు రోజువరకు మీడియా మైకుల ముందు నోటికొచ్చినట్లు మాట్లాడిన వైసీపీ ముఖ్యనేతలు.. పోలింగ్ సరళిని చూసి నీరసించిపోయారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రాదని నిర్ధారణకు వచ్చేశారు. పోలింగ్ సమయంలో అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లోనూ వైసీపీకి ఘోర ఓటమి ఎదురుకాబోతుందని స్పష్టమైందని ఆ పార్టీ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. ఈ పరిణామాలతో సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అలర్ట్ అయ్యారు. తన కుమారుడు సజ్జల భార్గవ్ నేతృత్వంలో కొనసాగుతున్న సోషల్ మీడియా విభాగం కార్యాలయానికి తాళం వేశారు. దీంతో ఇన్నాళ్లు ఆ విభాగంలో పనిచేస్తూ ‘నువ్వే జగన్.. నీ వెంటే జగన్’ అంటూ నినదించిన ఉద్యోగులు ప్రస్తుతం రోడ్డున పడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టి అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులు పాలుచేశాడు. పోలింగ్ సరళిని చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. వైసీపీ ప్రభుత్వం పాలనా విధానం సరికాదని రాజకీయ ప్రముఖులు, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నా జగన్ తీరులో మార్పు రాలేదు. దీనికితోడు జగన్ ప్రభుత్వానికి సజ్జల భార్గవ్ నేతృత్వంలోని సోషల్ మీడియా విశేష సేవలందించింది. సోషల్ మీడియా పేరుతో భార్గవ్ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని జగన్ ప్రభుత్వం తప్పులను ఒప్పుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీలపై ఇష్టమొచ్చిన రీతిలో సోషల్ మీడియా విభాగాల్లో పోస్టులు పెట్టడం, నేతల కుటుంబ సభ్యులపైనా అసభ్యకర పోస్టులు పెట్టడం వంటి దుర్మార్గపు పనులను సజ్జల భార్గవ్ విజయవంతంగా నిర్వర్తించి జగన్ ప్రశంసలు పొందారు. వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం వంటి కార్యక్రమాల్లోనూ భార్గవ్ కీలక భూమిక పోషించారు. భార్గవ్ పైశాచిక ఆనందానికి ఎంతోమంది ప్రాణాలుసై తం కోల్పోయారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా హద్దులు మీరి ప్రవర్తించడంతో ఈసీ కేసు కూడా నమోదు చేసింది. జగన్ ప్రజావ్యతిరేక పాలనతోపాటు.. భార్గవ్ నేతృత్వంలో కొనసాగుతున్న వైసీపీ సోషల్ మీడియా ఆగడాలకు విసిగిపోయిన ప్రజలు దేశ, విదేశాల నుంచి ఏపీకి తరలివచ్చి ఓటు ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం తాడేపల్లి జాతీయ రహదారిపై వైసీపీ ప్రధాన కార్యాలయానికి దగ్గరలో సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయంపైనే ఉంది. కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే సాగేవి. వందల మంది ఈ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తూ వచ్చారు. వీళ్ల పనల్లా ప్రతిపక్ష పార్టీల నేతలపై విష ప్రచారం చేయడం, వారి ఇళ్లలో మహిళలను అసభ్యకర పదజాలంతో దూషించడం. దీనికి తోడు ప్రభుత్వం తప్పులను ఒప్పులుగా సోషల్ మీడియా ప్లాంట్ ఫాంల ద్వారా ప్రజల మెదడుల్లోకి చొప్పించడం. ఇలా వైసీపీ కార్యకర్తలను ఓ విధంగా సైకోలుగా మార్చిన ఘనత కూడా భార్గవ్ కు దక్కుతుంది. జగన్ ప్రభుత్వం, వైసీపీ సోషల్ మీడియా అరాచకాలకు విసిరిగిపోయిన ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ సరళినిచూసి ముందుగానే వైసీపీ నేతలు ఓటమిని అంగీకరించారు. తాడేపల్లి కార్యాలయంలోని జగన్ వద్దకు కూడా భారీ ఓటమిని చవిచూడబోతున్నామని సర్వేల ఫలితాలు వెళ్లడంతో.. వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం వేసేశారు. ఉన్నట్లుండి 130 మందికిపైగా ఉద్యోగులను తొలగించేశారు. ఈ నెలాఖరు వరకు పనిచేసి జీతం తీసుకెళ్తామని చెప్పినా.. నెల మధ్యలోనే కార్యాలయం మూసేసి ఇంటికి పొమన్నారు. ఇక్కడే మూడు నాలుగేళ్లుగా పనిచేస్తూవచ్చిన ఉద్యోగులను సైతం ఉన్నట్లుండి వెళ్లిపోమనడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఉద్యోగాల్లో జాయిన్ అయిన సమయంలో వారికి ల్యాప్ టాప్ తోపాటు ఫోన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ల్యాప్ టాప్, ఫోన్ ఇవ్వాలని ఉద్యోగులకు భార్గవ్ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. రెండేళ్లు వాడుకున్న పాత ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఏం చేసుకుంటారు? సెకెండ్ హ్యాండ్ మార్కెట్ అమ్ముకుంటారా? అంటూ స్జజల, ఆయన తనయుడు సజ్జల భార్గవ్ పై ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సరళినిచూసి ఓటమి భయంతో వణికిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో ఉద్యోగులనుసైతం తీసివేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని స్పష్టం కావడంతోనే ఉద్యోగులను తొలగించి ఉంటారని చర్చించుకుంటున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా రెచ్చగొట్టడంతో ఇన్నాళ్లూ రెచ్చిపోయిన కార్యకర్తలు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో భయంతో వణికి పోతు న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. జగన్, సజ్జల, భార్గవ్ వంటి వారు ఎలాగోలా సేఫ్ ప్లేస్ కు వెళ్లిపోతారు.. ఇన్నాళ్లు వాళ్లనుచూసి రెచ్చి పోయిన మన పరిస్థితి ఏమిట్రా బాబోయ్ అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. మొత్తానికి వైసీపీ సోషల్ మీడియా ఉద్యోగుల పరిస్థితిని చూసి కూటమి పార్టీల నేతలూ, కార్యకర్తలూ నవ్వుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/lock-to-ycp-social-media-25-176070.html