తెలంగాణలో స్థానిక ఎన్నికలు.. ఇప్పట్లో లేనట్లే ?

Publish Date:Jun 22, 2025

Advertisement

 

 

ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇక ఇప్పట్లో లేనట్లేనా ? అంటే, అంతే అంటున్నారు, విశ్లేషకులు. ఏదో జరగరానిది జరిగితే ఏమో కానీ, లేదంటే, స్థానిక ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి స్థానిక సంస్థల గడవు ముగిసి ఇంచుమించుగా సంవత్సరం పైనే అయింది. రాష్ట్రంలో2019లో చివరిసారిగా, విడతల వారీగా, మూడు నాలుగు నెలలు పాటు స్థానిక సంస్థల ఎన్నికలు  జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల పదవీకాలం గత సంవత్సరం (2024) ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అలాగే,ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 3న, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవీకాలం అదే సంవత్సరం జూలై 4న ముగిసింది. 

మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం గత ఆగష్టులో ముగిసింది ఇక అప్పటి నుంచి పంచాయతీ మొదలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వరకు స్థానిక సంస్థలో, ప్రజా పాలన స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఈనేపధ్యంలో,గత ఫిబ్రవరి నుంచి, ప్రభుత్వం, త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెపుతూ వస్తోంది.అయితే, తాజా పరిణామాలు, మంత్రులు, పార్టీ పెద్దలు చేస్తున్న పరస్పర విరుద్ద  ప్రకటనలను గమనిస్తే,స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంలో ప్రభుత్వానికి, పార్టీకి కూడా క్లారిటీ లేనట్లుందని అంటున్నారు. అంతేకాదు, కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మెడ మీద కత్తి పెడితే తప్పించి, ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి మాత్రం లేదని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలోను అర్బన్ లోకల్ బాడీ    ఎన్నికలు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి, చివరకు,మే 2025 చివరకి కల్లా ఎన్నికలు నిర్వహిస్తామని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన గడవు ముగిసినా,ఇంతవరకు ఎన్నికల ఉలుకూ పలుకూ లేదని,అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలోనూ,అదే పరిస్థితి కొనసాగినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి ఒకవారం పది రోజుల క్రితం వరకు కూడా, కాంగ్రెస్ వర్గాలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో స్థానిక ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది.ముఖ్యంగా, ఈ నెలాఖరులోగా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన ప్రకటన స్థానిక నేతల్లో జోష్’ పెంచింది.  

అయితే కోర్టులో ఉన్న అంశాన్ని తనకు సంబంధం లేని శాఖపై ప్రకటన ఎలా చేస్తారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మంత్రి పొంగులేటిని మందలించినట్లు వార్తలు వచ్చినందున క్రింది స్థాయి నేతల ఉత్సాహం ఒక్కసారిగా చల్లబడి పోయింది.ఎన్నికల నిర్వహణ సందిగ్దంలో పడింది. అంతే కాకుండా, పీసీసీ చీఫ్, తాజాగా, న్యాయస్థానం తీర్పు  తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, స్పష్టం చేశారు. అంటే, ఇప్పట్లో స్థానికం లేదని చెప్పకనే చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం ప్రకటిస్తూ చట్టబద్దత కోసం కేంద్రానికి పంపింది.దీంతో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ అన్నిటినీ మించి, సర్వేలు, ఇంటెల్జెన్సీ నివేదికలు, ప్రభుతాన్ని,అధికార పార్టీని భయపెడుతున్నాయని అంటున్నారు.ఈ నేపధ్యంలో, స్థానిక సంస్థలఎన్నికలు,ఇప్పట్లో లేనట్లే, అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.