స్థానిక ఎన్నికల సస్పెన్స్‌ వీడేదెన్నడు?

Publish Date:Sep 26, 2012

Advertisement

 

 

 

స్థానికఎన్నికలు...ఈ మాట తరుచుగా కాంగ్రెస్‌ పెద్దల నోట మాత్రమే వినిపిస్తోంది...
ఎప్పుడైనా  కార్యకర్తలను ఊరడిరచటానికి...ఇంకొంచెం ద్వితీయస్థాయి నాయకులకు ఆశలు కల్పించటానికి....మరికొంచెం ముందుకు వెళితే ప్రతిపక్షాల నోరు నొక్కటానికి కాంగ్రెస్‌ ఈ పదాన్ని ఓ అస్త్రంలా ఉపయోగించుకుంటోంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పోకిరి సినిమాలో షిండే అన్నట్లు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా....అన్నట్లు బతికే ఓ రాష్ట్రపెద్ద రోజూ ఎవరికో ఒకరికి స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయ్‌ అని చెప్పేస్తుంటారు. చివరికి ఇదెంత పెద్ద జోక్‌గా మారిందంటే ఆ పార్టీలో ఎవరు కూడా ఆ పెద్ద అంటే నమ్మకం లేనంతస్థాయికి తీసుకువెళ్లింది. అఫ్‌కోర్స్‌! అందరికీ తెలిసిన ఆ పెద్ద సిఎం కుర్చీలో కూర్చుని తన పదవి కోసం ఈ మంత్రాన్ని పఠిస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మాట నిలుపుకోలేని సత్తా ఆయనకే చెల్లిందని కాంగ్రెస్‌ సీనియర్లు, పలుజిల్లాల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా చెప్పుకుంటున్నారు. నలుగురు ఏమంటే నాకేటీ సిగ్గు అన్నట్లు ఆయన మాత్రం ఎక్కడ ఏ సభ జరిగినా ఈ పదం వాడకుండా ముగించటం లేదు. తాజాగా ఏలూరు కాంగ్రెస్‌ సభలో కూడా ఒక నెలలో స్థానిక ఎన్నికలు అని హామీ ఇచ్చేశారు. నెలల తరబడి ఒక నెలలో ఎన్నికలు అని ఆయన చెప్పుకుంటూ పోవటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉప ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ స్థానిక ఎన్నికలు కనుక జరిపించకపోతే ఖచ్చితంగా కేంద్ర నిధులు గ్రామపంచాయతీలకు ఆపేస్తామని కూడా హెచ్చరించారు. ఆ గడువు కూడా పూర్తయినా ఇప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియటం లేదు. ఉప ఎన్నికల ప్రచారానికి తిరుపతి వచ్చి వెళుతూ ఎయిర్‌పోర్టులో తనను సాగనంపటానికి వచ్చిన కూతుహలమ్మ వంటి కాంగ్రెస్‌ నేతలకు కూడా సిఎం ఒకనెలలో స్థానిక ఎన్నికలు జరిపించేసి పార్టీని బలోపేతం చేసేద్దామని లేని ఉత్సాహాన్ని కల్పించారు. అంత తొందరగా సిఎం స్పందించారంటే ఇక ఎన్నికలే అనుకుని ద్వితీయశ్రేణి నాయకత్వానికి చిత్తూరు నేతలు ముందుగా వరాలు కురిపించారు. ఆ ద్వితీయశ్రేణి నేతలు ఇప్పుడు తిరుపతిలో ఎదురుతిరుగుతున్నారు. ఇదేమి పార్టీ అని కూడా నిలదీస్తున్నారు. మీ కన్నా మాట నిలుపుకునే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బావుందని తిరుపతి కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ సమావేశాల్లో విరుచుకుపడుతున్నారు. ఇంతలా సిఎం ప్రకటనపై నిరసన వ్యక్తం అవుతున్నా ఆయన మాత్రం అస్సలు ఈ విషయం పట్టించుకోలేదు. అంతేకాకుండా కేంద్ర మంత్రి చంద్రదేవ్‌ చెప్పినట్లే స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రత్యేకించి 11వ ఆర్థిక సంఘం నిధులు అస్సలు రాష్ట్రంలోని పంచాయతీలకు విడుదలవుతున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రప్రభుత్వానికి ఏర్పడిరది. దీంతో తాజాగా సీనియర్‌ మంత్రి జానారెడ్డి స్పందించి సుప్రీంకోర్టులో ఎన్‌ఎల్‌పీ వేసైనా నిధులను తెప్పించుకోవాలని భావిస్తున్నారు. నిధులు ఆపవద్దని కేంద్రాన్ని కోరుతామంటున్నారు. ముఖ్యమంత్రితో కూడా ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. అయితే ఎన్నికలు నిర్వహించటం అనేది ఇప్పట్లో జరగదని మాత్రం మంత్రి ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే అధికారాలు కోల్పోయి ఖాళీగా తిరుగుతున్న ద్వితీయశ్రేణి నేతలు మాత్రం ఈ సస్పెన్స్‌కు తెరదించాలని డిమాండు చేస్తున్నారు. నేరుగా అధిష్టానం ఈ విషయంలో పూనుకోవాలని వారు కోరుకుంటున్నారు.

By
en-us Political News

  
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.