Publish Date:Dec 18, 2024
తండ్రి డెత్ బెనిఫిట్స్ కోసం ఓ కూతురు చావు తెలివి తేటలు ప్రదర్శించింది. ఇద్దరు అన్నలను చంపేస్తే తండ్రి డెత్ బెనిఫిట్స్ మింగేయవచ్చు అని కలలు కన్నది. ఆమెకు ప్రియుడు దానయ్య తోడయ్యాడు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నలను మట్టు పెట్టింది. ఖేల్ ఖతమ్ అనుకుంది కానీ సీన్ రివర్స్ అయ్యింది. పల్నాడు జిల్లాలో డబుల్ మర్గర్ కేసులో ఈ చెల్లి కటకటాలపాలైందిహత్యకు గురైన వారిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. తన ఇంట్లోనే చెల్లెలి రూపంలో ఓ కరడు గట్టిన నేరస్థురాలు ఉందని ఆ కానిస్టేబుల్ ఊహించలేకపోయాడు.
నకిరికల్ డబుల్ మర్దర్ కేసును పోలీసులు చేధించారు. ప్రియుడితో కల్సి స్కెచ్ వేసినప్పటికీ అది వికటించింది. నవంబర్ 26వ తేదీన రక్తం పంచుకుని పుట్టిన అన్న రామకృష్ణను చున్నీతో చంపేసింది కృష్ణవేణి . శవాన్నిగోరంట్ల కాలువలో పడేసింది. ఈ మర్డర్ కేసులో ప్రియుడు దానయ్య పూర్తిగా సహకరించాడు. ఈ మర్డర్ బయటపడలేదు. వెంటనే కృష్ణవేణి మరో అన్నను మట్టు పెట్టాలని డిసైడ్ అయ్యింది. అన్న గోపికృష్ణ కానిస్టేబుల్. స్వంత చెల్లెలు హత్య చేస్తుంది అని పసిట్టలేకపోయాడు. మద్యంలో విషం కలి చంపేసింది కృష్ణవేణి. ఈ డెడ్ బాడీని కూడా అదే గోరంట్ల కాలువలో పడేసింది. రెండు మర్డర్ లు ఒకే విధంగా ఉన్నట్లు పోలీసులకు డౌటొచ్చింది. కూపీ లాగితే స్వంత చెల్లెలు కృష్ణవేణి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చేధించారు. కృష్ణవేణికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ప్రియుడు దానయ్యమోజులో పడి విలాసాలకు అలవాటు పడింది. అన్నలను చంపేస్తే నలుగురు టీనేజి యువకుల కోరిక తీరుస్తానని కృష్ణవేణి ఆశపెట్టిందని పోలీసులు తెలిపారు.
కృష్ణవేణి డబ్బుల కోసం స్వంత అన్నలను చంపడం పల్నాడు జిల్లాలో సంచలనమైంది. పవిత్రమైన అన్నా చెల్లెల బంధానికే ఈ కేసు మాయని మచ్చగా మిగిలింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/little-sister-death-is-not-wise-brother-murder-for-father-money-25-190024.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్